Suryaa.co.in

Telangana

కేసీఆర్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారు

-పంట నష్టపరిహారంపై బహిరంగ చర్చకు సిద్ధమా?
-రాజకీయ లబ్ధి కోసమే మొసలి కన్నీరు
-ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ భూస్థాపితం ఖాయం
-మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజం

నవ్వితే నాకేటి అన్నట్లు కేసీఆర్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. నాగర్‌కర్నూలు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేక రుల సమావేశం నిర్వహించారు. కేసీఆర్‌ కుటుంబం వేల కోట్లు దోచుకుందని విమర్శిం చారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు పదేళ్లలో ఏనాడూ రైతుల దగ్గరకు వెళ్లలేదని, ఎన్నికల్లో రాజకీయ లబ్ధిపొందేందుకు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్‌ సీయంగా ఉన్నప్పుడు పంటల బీమా పథకం అమలు చేయలేదు…పంటనష్టం ఇవ్వలేదు…ఇన్‌ పుట్‌ సబ్సిడీ లేదు…ఇలా రైతులను ఆధోగతి పాలు చేసింది కేసీఆరేనని ఎద్దేవా చేశారు. ఇవాళ రూ.25 వేల పంట నష్టం ఇవ్వాలని ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారని ప్రశ్నించారు. 2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాత్రమే కొంత మేర నష్టపరిహారం చెల్లించారని, అంతకుముందెప్పుడూ పరిహారం చెల్లించిన దాఖలాలు లేవన్నారు. దీనిపై కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. కృష్ణా జలాలను ఏపీ తరలించు కుపోతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించా రని, బీఆర్‌ఎస్‌ పాలనలో కృష్ణా పరివాహక ప్రాంతంలో రెండో పంటకు నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.

గోదావరి జలాలను సముద్రం పాలు చేశారని, అందుకే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో మీకు బుద్ది చెప్పారన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో సేమ్‌ సీన్‌ రిపీట్‌ కాబోతుందని, ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ భూస్థాపితం కావడం ఖాయమని వ్యాఖ్యానిం చారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ ప్రాంత ఓట్లు అడిగే నైతిక హక్కు ఒక్క కాంగ్రెస్‌ పార్టీకే ఉందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని, తెలంగాణలోనూ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోబోతున్నామని అన్నారు.

సీయం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేశామని, గతంలో కేసీఆర్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని హితవు పలికారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్‌రెడ్డి, మేఘారెడ్డి, జెడ్పీ చైర్‌ పర్సన్‌ సరిత తిరుపతయ్య, నాగర్‌ కర్నూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE