ఆదేశాలు ధిక్కరిస్తున్నా…చర్యలు శూన్యం

– సచివాలయాల దగ్గర పెన్షన్‌ రాజకీయ కుట్ర
-ఇళ్ల దగ్గర ఇవ్వాలని ఆదేశాలివ్వండి
-ఈసీకి, సీఎస్‌లకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ

ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను పాటించకుండా ప్రభుత్వం పెన్షన్‌దారులను సచివాలయం దగ్గరకు వచ్చి పెన్షన్‌ తీసుకోవాలని చెప్పడం దుర్మార్గమైన రాజకీయ కుట్ర అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. పేదలపై కక్ష, అధికారులు దీనికి వత్తాసు పలకడం దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికీ నగదు సచివాలయంలోకి అందలేదు. వైసీపీ కార్యకర్తలు మంచాలపై వృద్ధులను మోసుకు వస్తూ ఈసీ ఆదేశాలు ధిక్కరిస్తూ ఉంటే అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని, వెంటనే నగదు విడుదల చేసి ఇళ్ల వద్ద పెన్షన్‌ ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఈసీకి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బుధవారం లేఖ రాశారు. లబ్ధిదారులకు జరిగే కష్ట నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Leave a Reply