దేశంలో మోడీ అవినీతి,అరాచక పాలనపై పోరాటం చేస్తున్నది కేసిఆర్ ఒక్కరే

-దేవుని పేరుతో దేశాన్ని నిలువునా దోచుకుంటున్న పార్టీ బీజేపీ
-మోదీ+అధాని కలిస్తేనే ప్రధాని
-హిండేన్ బర్గ్ రీసెర్చ్ అదానీ భాగోతం బయటపెట్టింది
-మోడీ సచ్చీలుడైతే అదానీ పై సిబిఐ,ఈడి విచారణ జరపాలి
-మోడీ,అమిత్ షా కేవలం రెండు కేసుల్లోనే 22లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు
-దేశ రక్షణను గాలికి వదిలేశారు
-బిబిసి పై ఐటి దాడులు దుర్మార్గం..
-డబ్బులతో కొను లేకుంటే జైల్లో వేయి నేటి బీజేపీ సిద్దాంతం
-ఎమ్మెల్సీ కవితను జైల్లో వేస్తామని బీజేపీ ఎంపి ఎలా డిసైడ్ చేస్తడు
-ప్రశ్నించే వారిని వేదిస్తున్న బిజెపికి రోజులు దగ్గరపడ్డాయి.
-బిజెపి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు
– బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్

నిజామాబాద్,వేల్పూర్:ముఖ్యమంత్రి కేసిఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలోని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన సుమారు 500 మంది రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో శనివారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు..

ఇంత పెద్ద ఎత్తున కేసిఆర్,కెటిఆర్ ల నాయకత్వంలో పని చేసేందుకు వచ్చినందుకు దన్యవాదాలు తెలిపారు. ఇక నుండి మీరంతా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులే..మి అందరికీ నేను తోడుగా ఉంటానని మంత్రి భరోసానిచ్చారు. దేశంలో మోడీ అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ గారు ఒక్కరే పోరాటం చేస్తున్నారని మనమంతా వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దేశాన్ని నిలువునా దోచుకు
తింటున్న పార్టీ బిజెపి అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎనిమిదేళ్ళ బిజెపి మోది పాలనలో ఎవరికి లాభం జరిగిందో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. పైగా కేసిఆర్ ప్రభుత్వం చేసే మంచి పనులపై బిజెపి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం నుండి ఎన్ని నిధులు పల్లెలకు వస్తున్నాయి, కేసిఆర్ తెలంగాణ ప్రభుత్వం నుండి ఎన్ని నిధులు వస్తున్నాయో గమనించాలన్నారు.

రాష్ట్రం నుండి కేంద్రానికి 3లక్షల 70 వేల కోట్ల పన్నుల రూపంలో కడితే కేంద్రం ఇచ్చింది కేవలం 1లక్ష 70 వేల కోట్లు మాత్రమే అని,మిగితా సొమ్మంతా బిజెపి పాలిత రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు. మోది ప్రధాని అయిన తర్వాత డాలర్ తో రూపాయి విలువ ఎన్నడూ లేనివిధంగా క్షీణించిందని అన్నారు. మోడీ వచ్చిన కొత్తలో 56 రూపాలకు 1డాలర్ ఉంటే..ఇపుడు 83 రూపాలకు చేరిందని గుర్తు చేశారు. మోది వచ్చిన కొత్తలో నిరుద్యోగ రేటు 5.4 శాతం ఉండే..ఇపుడు 7శాతానికి పెరిగిందన్నారు. పెట్రోల్ ధర 60 రూపాలు ఉండే ఇపుడు 110 దాటిందని,డీజిల్ ధర 45 నుంచి 100 రూ. దాటిందన్నారు. గ్యాస్ సిలిండర్ ధర 450 నుండి 1200కు పెరిగిందన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారని విమర్శించారు. రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. మోడీ కంటే ముందు ఉన్న 13మంది ప్రధానులు 55లక్షల కోట్ల అప్పు చేస్తే మోడీ ఒక్కడే 8ఏళ్లలో 100లక్షల కోట్ల అప్పు చేశాడన్నరు. మరోవైపు చైనా మన దేశ సరిహద్దు దాటి వస్తున్న ఏమి చేయలేకపోతున్నారని, విదేశాంగ మంత్రి బాధ్యతారాహిత్యంగా చైనాతో ఇప్పుడు పెట్టుకోలేం అని మాట్లాడడం సిగ్గు చేటన్నారు.

అసలు దేశ రక్షణ గాలికి వదిలేశారని,అసలు మోడీ దేశం కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సామాన్య ప్రజలు చిన్న లోన్ తీసుకుంటే బ్యాంకులు ముక్కు పిండి వసూలు చేస్తాయి కానీ మోడీ తన కార్పొరేట్ మిత్రులు తీసుకున్న 12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని అన్నారు. ఎవడబ్బ సొమ్మని తమ కార్పొరేట్ మిత్రులకు మేలు చేసి దేశ ప్రజల మీద భారం వేశారని నిలదీశారు. అప్పనంగా వచ్చిన 12 లక్షల కోట్లను బిజెపి అధికారంలో లేని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ఖర్చు చేస్తున్నారన్నారు. అట్లా ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూలదోశారని మండిపడ్డారు. వేల కోట్ల ఎల్ఐసి ప్రీమియం డబ్బులను కూడా పక్కదోవ పట్టించిన ఘనత మోదిది అని అన్నారు. తన మిత్రుడు అదానీ కేవలం 8 ఏళ్లలో 45 వేల కోట్ల నుండి 11లక్షల కోట్లకు పడగలెత్తిండు ఆ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు. హిండేన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ మోడీ దోస్త్ అవినీతిని బయటపెట్టిందని అన్నారు. ఒక్క ఎల్ఐసి సంస్థనే అదానీ వల్ల 40వేల కోట్లు నష్ట పోయిందని అదంతా ప్రజలసొమ్మని అన్నారు. నిజంగానే ప్రధాని మోది సచ్చీలుడైతే అదానీపై సీబీఐ,ఈడి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించిన అందరిపై సీబీఐ నీ ప్రయోగిస్తున్నారని..రేపు తనలాంటి వారి పై కూడా వేదింపులు ప్రారంభిస్తారని అన్నారు.

కేసిఆర్ బిడ్డ ఎమ్మెల్సి కవితా జైల్ కు వెళ్తుందని ఒక మామూలు బీజేపీ ఎంపి ఎలా డిసైడ్ చేస్తాడని నిలదీశారు. 2జి స్ప్రెక్టం 1.70 లక్షల కోట్లకు అమ్ముడు పోతే ఆ విషయంలో అవినీతి జరిగిందని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోల చేసిన మోది..15 ఏళ్ల తర్వాత5జి స్పెక్ట్రం 1.48 లక్షల కోట్లకే అమ్మి 10 లక్షల కోట్ల అవినీతి కి పాల్పడింది వాస్తవం కాదా అని నిలదీశారు. రుణమాఫీ,5జి స్పెక్ట్రం లాంటి రెండు కేసుల్లోనే మోడీ,అమిత్ షా దాదాపు 22లక్షల కోట్ల అవినీతి చేశారని అన్నారు. అక్రమంగా వచ్చినడబ్బులు వెదజల్లుతూ స్వైర విహారం చేస్తున్నారని,వినకుంటే తప్పుడు కేసూలత్తో వేధిస్తున్నారని మండిపడ్డారు. వారి అవినీతిని ప్రశ్నిస్తున్న కేసిఆర్ కుటుంబంపై పడ్డారని, ఆయన కూతురు ఎమ్మెల్సి కవితమ్మను జైల్ కు పంపిస్తామని ఒక సాధారణ బీజేపీ ఎంపి మాట్లాడుతున్నారని అన్నారు. సుప్రీం కోర్టు వీరి ఆగడాలు అన్ని గమనిస్తున్నదని, అవినీతి బిజెపి నేతలకు బేడీలు తప్పవని హెచ్చరించారు.

నిజామాబాద్ ఎంపి అరవింద్ బాల్కొండ నియోజకవర్గం తిమ్మాపూర్ లో శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు…
ఎంపీ అరవింద్ నోరు విప్పితే అబద్ధాలు, బూతులు మాట్లాడుతరు తప్పా ఆయన వల్ల ఒరిగింది ఏమీ లేదన్నారు. తాను బాల్కొండ లో 10 వేల మందికి 40కోట్ల రూపాయలు ముఖ్యమంత్రిసహయనిది ద్వారా అందించాననీ,దమ్ముంటే ప్రధాన మంత్రి సహాయ నిధి కింద నిధులు తీసుకురావాలని సవాల్ చేశారు. ఎంపి అరవింద్ కు దమ్ముంటే గ్రామాల్లో పర్యటించే ముందు ఆ ఊరికి ఏమి ఇచ్చాడో,కేంద్రం నుంచి తెచ్చిన నిధులతో ఏమీ అభివృద్ది చేశాడో చెప్పి ఆ గ్రామంలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసిచ్చి గెలిచి రైతులను మోసం చేసిన అర్వింద్,ఇపుడు మళ్లీ గెలిపిస్తే పసుపు పరిశ్రమ తెస్తానని సిగ్గులేకుండా చెప్తున్నాడని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే అన్ని ఇస్త్చామని చెప్తున్న ఎంపి ముందుగా తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయించాలని డిమాండ్ చేశారు. 18 రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్న బిజెపి అక్కడ ప్రజలకు ఇస్తున్న పెన్షన్ ఎంతో అందరికీ తెలుసన్నారు. ప్రజలంతా మెల్లమెల్లగా ఆలోచన చేస్తున్నారు కాబట్టే బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు.ఈ ఎనిమిదేళ్ళ కాలంలో కేవలం బాల్కొండ నియోజక వర్గంలో 100 కోట్ల తో రోడ్లు నిర్మించానని తెలిపారు. వందల కోట్లతో బి.టి రోడ్లు, మెయిన్ రోడ్లు,చెక్ డ్యాంలు,హెల్త్ సబ్ సెంటర్,గ్రామ పంచాయతీ భవనాలు,కుల సంఘాల భవనాలు,50పైగా గుడులు నిర్మించుకున్నమని తెలిపారు. ఎండ కాలంలో కూడా నవాబ్ లిఫ్ట్,చౌట్పల్లి హన్మంతు రెడ్డి లిఫ్ట్ లను నడిపిస్తూ చెరువులను నింపుకుంటున్నమని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక జరిగిన అభివృద్ది, మార్పు ప్రజలు గుర్తించాలని కోరారు. కొందరు అక్కడక్కడ అబద్ధాలు ప్రచారం చేస్తారని అట్లాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అభివృద్దిపై గ్రామాల్లో చర్చ జరగాలని కోరారు.

Leave a Reply