– కేసీఆర్ అంటే తెలంగాణ..తెలంగాణ అంటే కేసీఆర్
– కేసీఆర్ ని ఫినిష్ చేసే స్థాయి నీది కాదు బుడబుక్కల రేవంత్
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: “తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ. కేసిఆర్ ను ఫినిష్ చేస్తా అని నోటికొచ్చినట్లు మాట్లాడడం నీ అవివేకం. తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని నాళ్ళు కేసీఆర్, తెలంగాణ ప్రజల మదిలో ఉంటాడు. ప్రతి రైతు,అవ్వా తాతల హృదయాల్లో ఉంటాడు.కేసీఆర్ ను ఫినిష్ చేయడం నీ తరం కాదు బుడబుక్కల రేవంత్ రెడ్డి. కేసీఆర్ కొండంత అయితే నువ్వు రవ్వంత.
కేసీఆర్ కట్టిన సచివాలయంలో ఉంటున్నావ్.కేసీఆర్ కట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండే నీవు పాలన సాగిస్తున్నావ్.అంటే రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్. ఆయన బిక్షే నీకు ముఖ్యమంత్రి పదవి. ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది నీ మీదే పడుతుంది.రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలో NO 1 స్థానంలో నిలబెట్టిన నాయకుడు కేసీఆర్.
నిన్ను ఫినిష్ చేసేందుకు రైతులు,మహిళలు,అవ్వా తాతలు, మూసీ,హైడ్రా బాధితులు,నిరుద్యోగులు అంతా సిద్ధంగా ఉన్నారు.చివరకు నీకు రక్షణ ఇచ్చే పోలీసులకు భయపడి దేశ సరిహద్దుల్లో పెట్టినట్లు సెక్రటేరియట్ చుట్టూ భద్రత పెంచుకున్నావు.
కేసీఆర్ ఆనవాళ్లు చేరపడం నీ వల్ల కాదు రేవంత్. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప అభివృద్ధి శూన్యం. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే చేయలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నావ్. హామీలు అమలు చేయమని మా నాయకులు పోరాటం చేస్తున్నారు. అది తట్టుకోలేక కేటీఆర్, హరీష్ రావు లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్.
కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లను ఏమో చేయాలని కలగంటున్నావు కానీ నువ్వేం ఏం చేయలేవు వారిని. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు రోడ్డు ఎక్కారు. పోలీస్ యూనిఫాం వేసుకొని ధర్నా చేస్తున్నారు పోలీసులు. ఉద్యోగులకూ ఇస్తామన్న డీఏ లు లేవు,పీఆర్సీ లేదు. పెన్షన్ పెంపు లేదు,ఉద్యోగాలు లేవు.రుణమాఫీ లేదు.రైతు భరోసా లేదు. వీళ్ళంతా నిన్ను ఫినిష్ చేస్తారు.
ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రయత్నం చేయి ముఖ్యమంత్రి.. పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఆ కుర్చీ స్థాయి దిగజార్చకు” అని తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తూ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.