కేసీఆరుకే దిక్కులేదు.. కేసీఆర్ పెట్టిన అభ్యర్థి మధిరలో ఏం గెలుస్తారు?

Spread the love

– భద్రాద్రి యాదాద్రి ఇప్పటికీ ప్రొడక్షన్ ప్రారంభం కాలేదు
– సభలోనే ధరణి గురించి మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు
– కేసీఆర్ చేసిన అవినీతిపై బీజేపీ ఇన్నాళ్లూ ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా?
– కేసీఆరుకు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని కేంద్ర హోం మంత్రే చెప్పారు
– ఎందుకు చర్యలు తీసుకోలేదు..?
– మధిర నియోజకవర్గం, ముదిగొండ మండలం, బాణాపురం గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

రాయేదో రత్నమేదో ప్రజలకు తెలుసు. కాబట్టే మధిర ప్రజలు మూడుసార్లు గెలిపించారు.కేసీఆర్ అనే ఓ బండ రాయిని.. రత్నం అనుకుని పదేళ్లు నెత్తిన పెట్టుకున్న ప్రజలు బండకేసి బాధడానికి రెడీ అవుతున్నారు.వంద మంది కేసీఆర్ వచ్చి మీటింగ్లు పెట్టిన మహిళలు నన్ను ఏం చేయలేరు మధిర ప్రజలను కొనలేరు.నువ్వు (కేసీఆర్) మీ కొడుకు మీ అల్లుడు నీ బిడ్డ ఎవరు వచ్చి ఎన్ని కుట్రలు చేసినా భట్టిని ఏం చేయలేరు.

ఇప్పుడే కాదు.. గతంలోనూ నన్ను ఓడించాలని కేసీఆర్ ఇలాగే ప్రయత్నించారు.. కానీ సఫలం కాలేకపోయారు.రాష్ట్రానికి దశా దిశా నిర్దేశం చేసే వ్యక్తిని గెలిపించాలని మధిర ప్రజలు కోరుకుంటున్నారు.కాంగ్రెస్ పార్టీకి కేవలం 20 సీట్లే వస్తాయని కేసీఆర్ భావిస్తే.. కాకిలా ఎందుకు తిరుగుతున్నారు.నన్ను గెలిపించండి.. నా అభ్యర్థిని గెలిపించండని కేసీఆర్ లెక్కకు మిక్కిలిగా సభలు పెడుతున్నారు.తానే గజ్వేల్లో గెలవలేనని కామారెడ్డి వెళ్లిన కేసీఆర్.. కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్పడం హస్యాస్పదం.

కేసీఆరుకే దిక్కులేదు.. కేసీఆర్ పెట్టిన అభ్యర్థి మధిరలో ఏం గెలుస్తారు?రాష్ట్రానికి దశ దిశా నిర్దేశించే వాళ్లు మధిర నుంచి ఎన్నికవ్వాలని మా ప్రజలు కోరుకుంటున్నారు.కాంగ్రెస్ పార్టీ 75 స్థానాలకు పైగా విజయం సాధించబోతున్నది.తెలంగాణ సీఎం ఎవరో మా అధిష్టానం నిర్ణయిస్తుంది.ఇందిరమ్మ రాజ్యం అంటే అభివృద్ధి సంక్షేమం, సంస్కరణ తీసుకొచ్చి భూములు పంచడం హరిత విప్లవం శ్వేత విప్లవం నీలి విప్లవంతో దేశాన్ని అభివృద్ధి చేశారు.

దేశంలో ఆర్థిక అసమానతలు తొలగించడానికి ఇందిరమ్మ రాజ్యంలోనే 20 సూత్రాలు తెచ్చారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇండ్లు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఉపాధి హామీ పని పింఛన్లు బ్యాంకుల జాతీయకరణ మిశ్రమాధిక విధానాలు బహుళార్థక సాధక ప్రాజెక్టులు ఇలా అనేక ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి.

సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం.బాంచన్ దొర అని వారిని బానిసలనుంచి విముక్తి చేసి నిటారుగా నిలబెట్టింది ఇందిరమ్మ రాజ్యం.ఇందిరమ్మ రాజ్యం వద్దని ఫ్యూడలిస్టుల రాజ్యంలోకి తీసుకొని వెళ్లాలని అనుకుంటున్నావా కేసీఆర్? సీఎంగా ఉండి కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితం అయ్యారు.సీఎల్పీ నేతగా నా నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తూనే రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాను.దళిత బంధు అమలు విషయంలో కేసీఆర్ నన్ను ఆహ్వానించింది నిజం కాదా?

దళిత బంధు అమలు విషయంలో నేను సూచనలు చేసింది నిజం కాదా..? దళిత బంధును కేసీఆర్ ఓట్ల కోణంలో మాత్రమే చూశారు.భట్టి విక్రమార్కకు భయపడే ముఖ్యమంత్రి కేసీఆర్ మధిరకు దళిత బంధు ఇచ్చారు.ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను లెక్కలతో సహా అసెంబ్లీలో నిలదీయడంతో దళిత బంధు తెచ్చారు.విద్యుత్ ఉత్పత్తికి కేసీఆర్ చేసిందేమిటీ..?గత కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మాణం చేసిన పౌర ప్రాజెక్టుల వల్ల ఇప్పుడు కరెంటు కొరత లేదు.తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో శ్రీమతి సోనియా గాంధీ రాష్ట్రానికి నాలుగు శాతం ఎక్కువగా కరెంటు కేటాయించింది.

కెసిఆర్ ప్రారంభించిన భద్రాద్రి యాదాద్రి ఇప్పటికీ ప్రొడక్షన్ ప్రారంభం కాలేదు.మరి కరెంటు ఎక్కడినుంచి తెచ్చి కేసీఆర్ ఇస్తున్నాడు. తానే కరెంటు ఇస్తున్నానని గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సీఎం కేసీఆర్ అడ్డగోలుగా అబద్ధాలు చెప్పడం సరికాదు సంపదను సృష్టించి పేదలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం.సభలోనే ధరణి గురించి మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు.

ఇంకా ధరణి గురించి కేసీఆర్ ఏం చర్చిస్తారు..? నేను మూడు సార్లు గెలిచినా మధిర సమస్యల పరిష్కారానికి కృషి చేశాను.కేసీఆర్ రాష్ట్ర సంపదను దోచుకున్నారు.. నేను మధిర సంపదను దోచుకోలేదు.. అభివృద్ధి చేశాను.తెలంగాణ రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబ సభ్యులు దోపిడీ చేసేస్తున్నారు.కేసీఆర్ లాంటి వాడు 50 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చుంటే గుండు సూది కూడా ఉత్పత్తి చేయలేకపోయేవాళ్లం. పదేళ్లల్లో కేసీఆర్ అప్పులు తప్ప చేసిందేముంది..? ఏమైనా అంటే కాళేశ్వరం అంటారు.. కాళేశ్వరం ఏమైందో చూశారుగా..?

కేసీఆర్ చేసిన అవినీతిపై బీజేపీ ఇన్నాళ్లూ ఏం చేస్తున్నారు..? గాడిదలు కాస్తున్నారా..? కేసీఆరుకు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని కేంద్ర హోం మంత్రే చెప్పారు.. ఎందుకు చర్యలు తీసుకోలేదు..? 40 వేల నుంచి 50 వేల మెజార్టీతో మధిరలో గెలుస్తా.

Leave a Reply