Suryaa.co.in

Telangana

కేసీఆర్ గతంలో నిధులు కాంట్రాక్టర్లకే ఇచ్చాడు

  • నా ప్రాధాన్యత ప్రకారం రుణమాఫీ చేసినా
  • ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి, ఢిల్లీలో మీడియా అడ్వజర్ కేసీఆర్ ఎవరికి ఇచ్చాడు ? పీసీసీ నా చేతిలో లేదు
  • నా సోదరులకు ప్రభుత్వంలో ఎలాంటి పదవులు లేవు. ఎవరు ప్రోటోకాల్ వాడడం లేదు
  • నాకు ఏడుగురు సోదరులు.. నేను సీఎం అయ్యా అని ఇంట్లో కూర్చుంటారా?
  •  చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ : ఒక్క పథకం ఆగలేదు. ప్రతినెలా 1 వ తేదిన ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నా. గతంలో నిధులు కేసీఆర్ కాంట్రాక్టర్లకే ఇచ్చాడు. నా ప్రాధాన్యత ప్రకారం రుణమాఫీ చేసినా. సింఘ్వి రాక ను స్వాగతిస్తున్నా. ఢిల్లీ వాళ్లకు రాజ్యసభ ఎలా ఇస్తారని బిఅరెస్ వాళ్ళ విమర్శలు పట్టించుకోవడం లేదు.

బిఅరెస్ వాళ్ళు కంటి నొప్పి, పంటి నొప్పికి కూడా ఢిల్లీకే వస్తారు క దా? ఆ మాత్రం వైద్యం చేసేటోళ్లు తెలంగాణ లో లేరా? ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి, ఢిల్లీలో మీడియా అడ్వజర్ కేసీఆర్ ఎవరికి ఇచ్చాడు ? పీసీసీ నా చేతిలో లేదు, అధిష్టానం నిర్ణయం ప్రకారమే. నా అభిప్రాయం ఎప్పుడో అధిష్టానం కి చెప్పా. వి.హనుమంతరావు కాంగ్రెస్ సీనియర్ నేత. హనుమంతరావు ను మించిన కాంగ్రెస్ విధేయుడు లేడు.

నా సోదరులకు ప్రభుత్వంలో ఎలాంటి పదవులు లేవు. ఎవరు ప్రోటోకాల్ వాడడం లేదు. వాళ్ళ సొంత డబ్బులతో విదేశాలకు వెళ్తే ఎవరికి ఇబ్బంది? అమెరికాలో నా కుటుంబ సభ్యులు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నారు. ప్రభుత్వంలో ఎటువంటి బాధ్యతలు నా సోదరులకు ఇవ్వలేదు. నాకు ఏడుగురు సోదరులు. నేను సీఎం అయ్యా అని ఇంట్లో కూర్చుంటారా? వారు వ్యక్తిగతంగా విదేశీ పర్యటనకు వెళ్లినా రాజకీయం చేస్తున్నారు.

LEAVE A RESPONSE