– నా బిడ్డల మీద ప్రమాణం ఏ పార్టీ తో నాకు సంబంధం లేదు
-బీజేపీ వల్ల కేసిఆర్ కి ప్రమాదం లేదు
-సంజయ్ పాదయాత్రకు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు
-లోటస్ పాండ్ రోడ్డు మీద ఆమరణ నిరాహార దీక్ష దిగిన వైఎస్ఆర్ టీపి అధ్యక్షురాలు షర్మిల
వైఎస్ షర్మిల ఏం మాట్లాడారంటే..ఎందుకు పాదయాత్ర చేయనివ్వడం లేదో కేసిఆర్ చెప్పాలి.హైకోర్టు అనుమతి ఇచ్చిన ఎందుకు అడ్డుకుంటున్నారు.షర్మిల పాదయాత్ర వల్ల కేసిఆర్ భయపడుతున్నాడు. ఒంటరిగా పుట్టాను ఒంటరిగా నే పోతాను.భయపడేది అయితే పార్టీ పెట్టేది కాదు షర్మిల . పోలీసులను మీ పనివాళ్ళల ఉపయోగించుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేయొద్దు కేసిఆర్.కేసీఆర్ పతనానికి ఈ రోజు నాంది.
నా ఆమరణ దీక్ష నా కాంపౌండ్ లో చేసుకుంటే పోలీసులకు ఏం ఇబ్బంది? మహాత్మా గాంధీ సత్యాగ్రహం చేసినప్పుడు ఎవరిని పర్మిషన్ తో చేశారు? నాకు నిరసన తెలిపే హక్కు లేదా? పోలీసుల ఏక పక్ష వైఖరి మార్చుకోవాలి. త్వరలోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నీ ప్రజలు ఆదరించే రోజు వస్తుంది.కేసిఆర్ పార్టీ లో నుంచి తెలంగాణ పదం తీసేయడం నుంచే ఆయన పతనం మొదలైంది. బీజేపీ వల్ల కేసిఆర్ కి ప్రమాదం లేదు. బండి సంజయ్ పాదయాత్రకు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు.కేసిఆర్ కి బీజేపీ నే పెళ్ళాం. కాళేశ్వరం లో అవినీతి జరిగిందని చెప్పే బీజేపీ ఎందుకు విచారణ చేయరు? నా బిడ్డల మీద ప్రమాణం ఏ పార్టీ తో నాకు సంబంధం లేదు.