కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం

-ప్రధాని కాలి వెంట్రుకకు కూడా పనికిరాని వ్యక్తి కేసీఆర్
-బండి సంజయ్ జనం గుండెల్లో నిలిచిన నేత
-తెలంగాణ అమరుల శవాలపై పేలాలేరుకునే కేసీఆర్ కు బండిని విమర్శించే అర్హత ఉందా?
-పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం…

ముఖ్యమంత్రి కేసీఆర్ అతి త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథలో జరిగిన అవినీతి త్వరలో బట్టబయలు కాబోతోందన్నారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన బండి సంజయ్ ను విమర్శించే అర్హత కేసీఆర్ కు ఉందా? అని ప్రశ్నించారు. గడప దాటడానికే చేతగాని కేసీఆర్ జాతీయ పార్టీ పెడతానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాలిగోటికి కూడా పనికిరాని కేసీఆర్ ప్రపంచదేశాలన్నీ కీర్తిస్తున్న మోదీపై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ తోపాటు పాదయాత్ర చేసిన బాలసుబ్రమణ్యం ఈ సందర్భంగా జనగామ పట్టణంలో జరిగిన సభకు హాజరై ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు…

గత కొంత కాలంగా సీఎం కేసీఆర్ ఫ్రస్టేషన్ ఎక్కవై మానసిక రోగిలా మారారు. ఒకవైపు కొడుకును సీఎంను చేయాలేకపోతున్నాననే అసమర్ధత, ఇచ్చిన హామీలను అమలు చేయలేక, అవినీతిని, భూ కబ్జాలను కట్టడి చేయలేని అసమర్థత వల్ల ఫ్రస్టేషన్ ఎక్కువైంది.

కర్కష, క్రూరమైన, కుటుంబ పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ పాలనకు చరమ గీతం పలికేందుకే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మనం సిద్ధంగా ఉన్నాం. బీహార్ లాలూ ప్రసాద్ మాదిరిగా కేసీఆర్ త్వరలో జైలుకు పోవడం ఖాయం. ఆయన అవినీతి త్వరలో బయటపడపోతోంది. కాళేశ్వరంలో, మిషన్ భగీరథలో జరిగిన అవినీతి బయటకు రావడం ఖాయం.. జైలుకు పోవడం తథ్యం.

తన అసమర్థతను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ప్రధాని నరేంద్రమోదీపై అవాకులు చవాకులు పేలుతూ సీఎం స్థాయిని తగ్గించుకునే స్థితికి కేసీఆర్ దిగజారారు. గడపదాటడం చేతగానికి కేసీఆర్ జాతీయ పార్టీ పెడతానంటూ దేశం గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ నరేంద్రమోదీ కాలి గోటికి కూడా పనికిరావు. చెన్నై, బెంగాల్ సహా కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా పట్టించుకునే వారెవరూ లేరు.

కేసీఆర్ నియమించుకున్న పీకే సర్వేలే బీజేపీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని, తెలంగాణలోనూ అధికారం తథ్యమని చెబుతున్నాయి. ఆ విషయం కేసీఆర్ మర్చిపోవద్దు. బండి సంజయ్ పాదయాత్రకుpadayatra ఊరూవాడ తరలివస్తున్న జనమే ఇందుకు సాక్షం. ఇవాళ పోలీసులను, గూండాలను అడ్డుపెట్టుకుని బండి సంజయ్ పై దాడి చేయించాలని టీఆర్ఎస్ నేతలు చూస్తున్నారు… నేను కేసీఆర్ కు సవాల్ విసురుతున్నా… బీజేపీ కార్యకర్తను టచ్ చేసి చూడు… రాబోయే రోజుల్లో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొక తప్పదు.

Leave a Reply