Suryaa.co.in

Telangana

కేసీఆర్…ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే పురుగులు పడిపోతావ్

-ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా కేసీఆర్ మహా కుట్ర
-బీజేపీపై నెపం నెట్టి సుప్రీంకు వెళ్లి స్టే తేవాలని టీఆర్ఎస్ స్కెచ్
-దమ్ముంటే.. ఎస్టీ రిజర్వేషన్ల అమలుపై ప్రమాణం చేద్దాం రా….
-కాంగ్రెస్ తో కలిసి ద్రౌపది ముర్మును ఓడగొట్టేందుకు యత్నించి కేసీఆర్ ఎస్టీలకు మాట్లాడటం సిగ్గు చేటు
-ప్రజా సమస్యలు పట్టించుకోని ఏకైక సీఎం కేసీఆరే
-తడిబట్టతో గొంతు కోసే మూర్ఖుడు కేసీఆర్
-లిక్కర్ సహా అన్ని స్కాముల్లోనూ కేసీఆర్ కుటుంబమే
-క్వారంటైన్ పేరుతో ఏ స్కాం కు స్కెచ్ వేస్తున్నరో…
-సీఎం కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగిన బండి సంజయ్
-ఉప్పల్ నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతున్న సంజయ్
-ఉప్పల్ సమస్యలను ప్రస్తావిస్తూ… భరోసానిస్తూ ముందుకు సాగుతున్న బండి సంజయ్
-22న పెద్ద అంబర్ పేటలో జరిగే భారీ బహిరంగ సభకు తరలిరావాలంటూ పిలుపు

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మహా కుట్రకు ప్లాన్ చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. నాపైన, బీజేపీపైన నెపం నెట్టి సుప్రీంకోర్టుకు వెళ్లి ఎస్టీ రిజర్వేషన్లు అమలు కాకుండా స్టే తెచ్చుకునేందుకు స్కెచ్ వేశారని మండిపడ్డారు. అందులో భాగంగా తాను ఎస్టీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

‘‘కేసీఆర్… ఈ ఉప్పల్ నియోజకవర్గంలోని విఘ్నేశ్వర ఆలయం ముందు ప్రమాణం చేద్దాం… రా. ఎస్టీ రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్నదెవరో తేల్చుకుందాం’’అంటూ సవాల్ విసిరారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కుమార్ కు అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు. బాణా సంచా పేల్చి, పూలు జల్లి, మంగళహారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. హెచ్ బి కాలనీ ఎన్టీఆర్ విగ్రహం చౌరస్తా వద్ద భారీ ఎత్తున హాజరైన ప్రజలను ఉధ్దేశించి బండి సంజయ్ ప్రసంగిస్తూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.

సంజయ్ ప్రసంగ పాఠం వివరాలు…. నిన్ననే ఉప్పల్ నియోజకవర్గంలోకి పాదయాత్ర అడుగు పెట్టింది. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తి అద్వానంగా ఉంది. చిన్న వర్షం వస్తే చాలు.. మోకాళ్ళ లోతు నీళ్లు, బురద. ఇక్కడికి వచ్చి ఉప్పల్ ని దత్తత తీసుకుంటానన్న నాయకులు ఎక్కడికి పోయారు? కేసీఆర్ కొడుకు, బిడ్డ పొట్టుపొట్టు పైసలు దండుకుంటున్నారు.

మహిళలను గౌరవించడమే మన భారతీయ సంస్కృతి. మహిళలను గౌరవించని నీచ సంస్కృతి టీఆర్ఎస్ వాళ్ళది. లిక్కర్ స్కామ్, డ్రగ్స్, పత్తాలు, కబ్జాలు.. ఇలా అన్నీ కేసీఆర్ బిడ్డవే.. సీబీఐ అంటే కాలు ఇరుగుతది… ఈడీ అంటే కరోనా వస్తది. ప్రజా సమస్యలను పట్టించుకోని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. తడి బట్టతో గొంతు కోసే మూర్ఖుడు.

ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. టిఆర్ఎస్ వాళ్ళను తీసుకెళ్లి, డంపింగ్ యార్డులో కట్టేయాలని నిన్న మేడ్చల్ లో చెప్పిన. దేశంలో, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బిజెపి. బెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని గూగుల్ లో సెర్చ్ చేస్తే మోడీ వస్తారు. వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అంటే కెసిఆర్ వస్తాడు. ఇవన్నీ నేను చెబుతున్నది కాదు.. గూగుల్ చెబుతున్నవే.

ఈ ఉప్పల్ నియోజకవర్గంలో ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారు? ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇచ్చాడు. దేశంలో… రాష్ట్రాల పర్యటన చేస్తూ దోచుకున్న సొమ్మును అక్కడ ఇచ్చి వస్తున్నాడు కేసీఆర్. స్పెషల్ ఫ్లైట్స్ లో తిరుగుతున్నాను. ఇక్కడ అభివృద్ధి ఎందుకు చేయడం లేదో టిఆర్ఎస్ నేతలను గల్లా పట్టి ప్రశ్నించండి. ఉచితంగా నీళ్లు ఇస్తానన్న కేసీఆర్… ఒక్కో ఇంటికి 500 రూపాయలు వసూలు చేస్తున్నాడు. 100% కరెంటు చార్జీలను పెంచాడు. ఆర్టీసీ చార్జీలను పెంచాడు. అన్ని చార్జీలను పెంచిన మూర్ఖుడు కేసీఆర్.

ఈ ప్రాంతంలో ఉన్న ఐదు పారిశ్రామిక వాడలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తు సహా ఇతర సౌకర్యాలు కల్పిస్తోంది. మరి కెసిఆర్ చేస్తున్నది ఏమిటి? ఉప్పల్ నియోజకవర్గాన్ని కేసీఆర్ నాశనం చేస్తున్నాడు. ఇక్కడి సమస్యలపై ప్రజలే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరి చూపిస్తున్నారు. ఉప్పల్ ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వని కేసీఆర్…. ఎనిమిది నెలల్లో 100 రూములతో ఇల్లు కట్టుకున్నాడు. రోజుకో రూమ్ లో తాగుడు… రోజుకో రూమ్ లో పండుడు. అసలు తెలంగాణలో కేసీఆర్ ను ఎలా ముఖ్యమంత్రిని చేశారని దేశంలోనే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు? ఉచితంగా బియ్యం, కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోదీదే. రైతుబంధు, దళిత బంధు హామీ ఏమైంది? దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది?

ఎస్టీ రిజర్వేషన్లపై నేను అనని మాటలను కూడా కొంతమంది బట్టేబాజ్ గాళ్ళు, లుచ్చా గాళ్ళు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఇగో (పేపర్ చూపిస్తూ) సోషల్ మీడియాలో గిట్ల ప్రచారం చేస్తున్నరు. ఇదంతా క కేసీఆర్ పనే… ఎందుకంటే పాస్పోర్ట్ల బ్రోకర్ కేసీఆర్. జిహెచ్ఎంసి వరద బాధితులకు పదివేల రూపాయలు ఇవ్వొద్దని నేను రాసినట్టుగా… నా లెటర్ హెడ్ పై కేసీఆర్ దొంగసంతకం పెట్టిండు. అదే విషయమై భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద నిరూపిస్తా అంటే… తోకముడిచిండు. ఎస్టీ రిజర్వేషన్లను బిజెపి పేరు చెప్పి, కోర్టు ద్వారా ఆపే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు. కెసిఆర్ ది ఒక బతుకేనా…? ఎందుకు బతుకుతున్నడో… ఛీ… ఇన్ని రోజులు ఎస్టీ రిజర్వేషన్లను ఎందుకు ఆపిండు?

సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం కాదు… కెసిఆర్ ఉన్నన్ని రోజులు కొత్త సచివాలయంలో ఒక కుర్చీ వేసి, దళితుడిని ముఖ్యమంత్రిగా కొనసాగించాలి. ఎస్టి సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డను రాష్ట్రపతిగా చేద్దామంటే… ఆ ఎస్టీ బిడ్డను ఓడించే ప్రయత్నం చేసినోడు కేసీఆర్. ఎస్టీలను మోసం చేసిన కేసీఆర్ ను ఎస్టీలు నమ్ముతారా? కెసిఆర్ ను ప్రజలెవరు నమ్మే పరిస్థితి లేదు.

కాంగ్రెస్, టిఆర్ఎస్, టిడిపి పార్టీలకు ఓటు వేశారు. ఒక్కసారి బిజెపికి అవకాశం ఇవ్వండి. సంవత్సరం నుంచి మీ కోసమే పాదయాత్ర చేస్తున్నాం. కెసిఆర్ పేదలకు ఇచ్చిన హామీలను విస్మరించి, ఎలా మోసం చేశాడో… కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందో…. ఆ విషయాలను చెప్పడానికే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం. ఈనెల 22న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్ పేటలో సాయంత్రం 4 గంటలకు ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ. ముగింపు సభకు ప్రజలంతా స్వచ్ఛందంగా తరలి రావాలని చేతులు జోడించి వేడుకుంటున్నా.

LEAVE A RESPONSE