(ఏ. బాబు)
కేసీఆర్ కి రాజకీయంగా పార్టీలను , నాయకులను వాడుకుని మళ్ళీ వాళ్లనే తిట్టటం అలవాటే. మొదట్లో ఇందిరా గాంధీ నేతృత్వంలో యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు .1983 లో కాంగ్రెస్ ఓడిపోయినాక తెలుగు దేశంలో జేరాడు . చంద్రబాబు వద్ద మంత్రి పదవులు అనుభవించాడు . కులసమీకరణాలలో అతనికి మంత్రి పదవి ఇవ్వలేక పొతే , చంద్రబాబుని తిట్టి టీఆరెస్ పార్టీ స్థాపించాడు.
2004 లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని , తన అల్లుడికి మరో నలుగురికి రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో మంత్రి పదవులు మరియు సెంటర్ లో కాబినెట్ మంత్రి పదవి పొందాడు. 2009లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని చంద్రబాబుని పొగిడాడు. తెలంగాణా ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తానని సోనియాకు మాటిచ్చి , తీరా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పార్టీని కాంగ్రెస్ లో కలపలేదు.
9 సంవత్సరాలు పాలించి కొడుక్కి , కూతురికి , అల్లుడికి పదవులు ఇచ్చి వేల కోట్లు , వేల ఎకరాలు , ఫామ్ హౌస్ లు సంపాదించారు. కుటుంబం అంతా. పాప అయితే హైదరాబాద్ లో ఏ పెద్ద బంగారం దుకాణం వదల్లేదు.తెలంగాణా ఉద్యమంలో అమాయకులైన కుర్రాళ్లు మంటల్లో ఆహుతి ఐతే , వీళ్ళ కుటుంబం నుండి ఒక్కరు కూడా చనిపోలేదు.హరీష్ రావుకి కిరసనాయిలు దొరికింది కానీ అగ్గిపెట్ట దొరకలేదు.
9 సంవత్సరాల పాలనలో మోడీ ని , బీజేపీ ని అసెంబ్లీలో , ప్రెస్ కాన్ఫరెన్సులలో గంటల తరబడి బండ బూతులు తిట్టి , తన కూతురు మద్యం కేసులో ఇరుక్కుంటే , ఇప్పుడు ఢిల్లీ పెద్దలతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని , పార్టీని బీజేపీ లో కలపటానికి సిద్దమయ్యాడు .ఇతనిని నమ్మితే , బీజేపీ మోసపోతుంది.
2014లో ఎన్నికలలో గెలిచాక , కుటుంబం అంతా ఢిల్లీ వెళ్లి సోనియా కాళ్ళ మీద పడి ధన్యవాదాలు చెప్పారు.ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం అసెంబ్లీ ముందు పెట్టనీయరట. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విగ్రహం తీయించేస్తామని “”లోకల్ ఫీలింగ్”” రెచ్చగొట్టటానికి ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ని , ఆ కుటుంబాన్ని నమ్మే రోజులు పోయాయి.ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలలో 8 సీట్లలో డిపాజిట్లు రాలేదు .ఇక కేసీఆర్ పార్టీ పని అయిపోయినట్లే!! ఎవరూ ఇక నమ్మరు. బి ఆర్ యస్ ఖాళీ…రిటర్న్ గిఫ్ట్… దేవుని నిర్ణయం.