పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై విచారణలో NIA కీలకమైన పురోగతి సాధించింది. ఈ దాడి వెనుక లష్కరే తోయిబా, పాక్ ఆర్మీ, ISI ఉన్నట్లు ప్రాథమిక నివేదిక వెల్లడించింది. LeT హెడ్‌క్వార్టర్స్ లో ప్రణాళిక సిద్ధమైందని, సీనియర్ ISI అధికారుల సూచనలతో దాడి జరిగిందని తెలిపింది. ‘POK నుంచి హష్మీ మూసా, అలీ భాయ్ వచ్చారు. వీరు పాక్ హ్యాండ్లర్లతో నిత్యం టచ్‌లో ఉన్నారు. లోకల్ ఉగ్రవాదుల సాయంతో దాడికి పాల్పడ్డారు’ అని వివరించింది.