-
వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కిడ్నాప్ అంటూ వైసీపీ గత్తర
-
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో సిపాయిని కిడ్నాప్ చేశారంటూ వైసీపీ ఆరోపణ
-
ఎస్‌ఈసీకి ఫిర్యాదుల వెల్లువ
-
నేను కిడ్నాప్ కాలేదంటూ వీడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ సిపాయి
-
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరానంటూ వివరణ
-
పరువు పోగోట్టుకున్న వైసీపీ
-
కిడ్నాప్ కథ బూమెరాంగ్
( మార్తి సుబ్రహ్మణ్యం)
వైసీపీ వ్యూహం వికటించింది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీని టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఊదరగొటిన్ట వైసీపీ మీడియా, ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతల పరువు పోయింది. ఆ పరువు తీసింది మరెవరో కాదు. ఎవరైతే కిడ్నాప్ అయ్యారంటూ గత్తర చేశారో, ఆ ఎమ్మెల్సీనే తెరపైకి వచ్చి.. నన్నెవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పి, వైసీపీ గాలితీసిన వైనంతో వైసీపీ అడ్డంగా బుక్కయింది. ఫలితంగా వైసీపీ వ్యూహం బూమెరాంగయింది.
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల అనేక మలుపులు తిరిగి, చివరికి ఎన్నికతో సుఖాంతమయింది. ఆ ఎన్నికలో టీడీపీ అభ్యర్ధి విజయం సాధించారు. దానికంటే ముందు ఎన్నిక రాజకీయ రసకందాయలో పడింది. వైసీపీ క్యాంపు రాజకీయాలు నడిపినా, ఆ పార్టీ తమవారిని కాపాడుకోలేకపోయింది. ఈ మధ్యలో వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంను.. టీడీపీ కిడ్నాప్ చేసిందని వైసీపీ మీడియా హోరెత్తించింది. రాష్ట్రంలో తాలిబన్ల పాలన నడుస్తోందని ఆరోపించింది.
మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అయితే మరో అడుగుముందుకేసి, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందికాబట్టి, రాష్ర్టంలో రాష్ర్టపతి పాలన విధించాలన్న విచిత్రమైన డిమాండ్‌కు తెరలేపారు. కిడ్నాప్ అయిన తమ ఎమ్మెల్సీ సిపాయిని రక్షించాలని వైసీపీ నేతలు ఎస్‌ఈసీ వద్దకు పరుగులు తీసి వినతిపత్రం సమర్పించారు.
ఆ తర్వాత కొద్దిసేపటికి.. ఎవరైతే కిడ్నాపునకు గురయ్యారని ఆరోపించారో.. అదే ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ఒక వీడియో విడుదల చేశారు. తనను ఎవ రూ కిడ్నాప్ చేయలేదని, తనను ఎవరూ బెదిరించలేదని వీడియో విడుదపల చేయడంతో, వైసీపీ పరిస్థితి కుడితలోపడిన ఎలుకమాదిరి అయింది.
తాను అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నందున, తన గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన పిలుపునిచ్చారు. దానితో ఎమ్మెల్సీ సిపాయి కిడ్నాప్ అయ్యారన్న.. వైసీపీ సిపాయిల కట్టుకథ కంచికిచేరినట్లయింది.