– బాధ్యతలు మరచి చిల్లర విమర్శలేల?
– అడ్డగోలు విమర్శలు,అబద్దపు కూతలు చేస్తూ అసమర్థుడిగా మిగిలిపోతున్నారు
– గ్రేటర్ వరదల్లో బండి పోతే బండి ఇస్తామన్న డంబాచారాలేమయ్యాయ్?
– వారిని ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వమే
– మీ చేతగానితనం తెలంగాణకు శాపం
– ప్రజల అవసరాలను విస్మరించి నిస్సిగ్గుగా చిల్లర రాజకీయాలను చేయటం హేయమైన చర్య
– చేతనైతే తెలంగాణకు విపత్తు సాయం తెచ్చి మాట్లాడండి
– కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై నర్సంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లేఖాస్త్రం
తెలంగాణకు కేంద్రమంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి వల్ల, తెలంగాణ రాష్ట్రానికి అర్ధరూపాయి లాభం కూడా లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. ఇన్నేళ్లలో కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వంపై చిల్లర విమర్శలు తప్ప, తెలంగాణకు సాధించిందేమిటని నిలదీశారు. పక్క రాష్ట్రాలకు కేంద్రం నిధులిస్తుంటే, కిషన్‌రెడ్డి తన పలుకుబడి వినియోగించి తెలంగాణకు ఎందుకు నిధులిప్పించలేకపోతున్నారని ప్రశ్నించారు. ఆ మేరకు ఆయన కిషన్‌రెడ్డికి బహిరంగలేఖ సంధించారు. సుదర్శన్‌రెడ్డి లేఖ పాఠం ఇదీ..
కేంద్రమంత్రి శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి బహిరంగ లేఖ..
తెలంగాణా రాష్ట్రం నుండి పార్లమెంట్ సభ్యుడిగా మీరు ప్రాతినిద్యం వహిస్తున్నారు..ఈ ప్రాంత భిడ్డగా కేంద్రమంత్రి గా ఉన్నారు..కానీ కేంద్రమంత్రిగా ఉన్న మీరు ఆ భాద్యతలు మరిచి అడ్డగోలు చిల్లర విమర్శలకే పరిమితమయ్యారు తప్ప ఏనాడూ తెలంగాణ ప్రయోజనాలకోసం పనిచేయలేదు. నాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయినట్టుగానే, నేడు కేంద్రమంత్రిగా ఉండి కూడా తెలంగాణాకు ఒక్క రూపాయినికి కూడా తేలేక ఒక అసమర్థునిగా మిగిలిపోతున్నారు. పక్క రాష్ట్రాలకు కేంద్రం నిదులిస్తుంటే పట్టించుకోకుండా సిగ్గులేకుండా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు..
తెలంగాణ ప్రభుత్వం గోదావరి వరదల సమయంలో 1000 కోట్ల సహాయాన్ని అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు..హైదరాబాద్ లో బారీ వర్షాలతో వరదలొస్తే బండి పోతే బండి ఇస్తాం అంటూ డంబాచారాలు పలికి అర్థరూపాయి సాయం కూడా చేయలేకపోయారు..తెలంగాణ ప్రభుత్వమే వారిని ఆదుకుంది..వరంగల్ జిల్లాలో గత ఏడాది జనవరిలో వడగల్ల వాన సృష్టించిన విద్వంసానికి రైతులు తీవ్రంగా నష్టపోతే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి నష్టపోయిన రైతులకు ఇన్ పుడ్ సబ్సిడి అందించి ఆదుకుంది. తెలంగాణా నుండి ప్రాతినిద్యం వహుస్తున్న మీరు మాత్రం అర్థరూపాయి సాయం చేయకపోగా కనీసం ఇటువైపు చూడనూ లేదు..తెలంగాణకు ప్రతీ విషయంలో మొండిచెయ్యి చూపుతారు కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు మరియు ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు మాత్రం అడక్కుండానే నిదులు ఇస్తూ మీ ప్రభుత్వం వక్రబుద్దిని చాటుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని వరదసాయం అడిగితే మొండి చేయి చూపించిన మోదీ సర్కారు.
బీజేపీ పాలిత.. ఎన్నికలున్న ఐదు రాష్ట్రాలకు రూ.1,816.16కోట్లను ప్రకృతి వైపరీత్యాల సహాయనిది కింద కేటాయించింది మోదీ సర్కారు..గోదావరి వరదల సమయంలో మాకు రూ.1000కోట్లు వరదసాయం ఇవ్వాలని తెలంగాణ సర్కారు కేంద్రాన్ని అడిగింది..ఒక్కరూపాయి కూడా మంజూరు చేయని బీజేపీ ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రానికి రూ..941.04కోట్లు, మేఘాలయ రాష్ట్రానికి రూ.47.33కోట్లు,అస్సాం కు 520.466కోట్లు,హిమాచల్ ప్రదేశ్ కు 239.31కోట్లు మంజూరు చేసింది..తెలంగాణ పై బీజేపీ ప్రభుత్వం సవతితల్లి ప్రేమను చూపుతుంది.. మీ చేతగానితనం తెలంగాణకు శాపంగా మారింది. అర్థరూపాయి కూడా తెలంగాణాకు విపత్తులకు వచ్చే సహాయనిదిని తేలేకపోయారు.. ఇది చేతకాదు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై వారి కుటుంబంపై చిల్లర విమర్శలు చేస్తూ నిస్సిగ్గుగా నీచ రాజకీయం చేస్తున్నారు..ప్రజల అవసరాలను విస్మరించి ప్రశ్నించిన వారిపై,నిలదీసిన వారిపై కక్ష సాదింపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు..తెలంగాణకు రావాల్సిన నిదుల్లో అన్యాయం,ఈ ప్రాంతానికి హక్కుగా రావాల్సిన వాటాలపై కేంద్రాన్ని అడగడం చేతకాదు..పకృతి వైపరీత్యాలకు కేంద్రం నుండి నిదులు తీసుకురావటానికి చేతకాలేదు కానీ అడ్డగోలు విమర్శలు,అబద్దపు కూతలు చేస్తూ అసమర్థుడిగా మిగిలిపోతున్నారు..
తెలంగాణను అభివృద్ది చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పాలనను చూసి ఓర్వలేక చిల్లర మల్లర విమర్శలు చేస్తూ అధికార వాంచతో అడ్డదారులు తొక్కుతున్నారు..దమ్ముంటే తెలంగాణకు రావాల్సిన నిదుల గురించి కేంద్రంలోని మీ మోదీ ప్రభుత్వంతో మాట్లాడండి..చేతనైతే తెలంగాణకు విపత్తు సాయం తెచ్చి మాట్లాడండి,మీ వికృత రాజకీయ క్రీడలను ప్రజలు గమనిస్తున్నారు..మీ కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొడుతుంది..ప్రజలే మీకు సరైన బుద్ది చెబుతారు..ఈ ప్రాంత ప్రజల ఓట్లతో కేంద్రమంత్రి అయిన మీరు,ఈ ప్రాంత ప్రజల అవసరాలను విస్మరించి నిస్సిగ్గుగా చిల్లర రాజకీయాలను చేయటం హేయమైన చర్య.దీనికి మూల్యం చెల్లించుకోకతప్పదు.
– పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట శాసనసభ్యులు