Suryaa.co.in

Telangana

కేసీఆర్ ది ఒక తొండి ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం

-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
-కిషన్ రెడ్డి నోట జై శ్రీరామ్ నినాదం
-జై శ్రీరామ్ అంటూ…ప్రసంగం ముగించిన కిషన్ రెడ్డి

ఉద్యమాల పురిటి గడ్డ ఓరుగల్లు గడ్డ. చైతన్యానికి ప్రతీక ఓరుగల్లు. కేసీఆర్ అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం.కేసీఆర్ తో పాటు కేసీఆర్ కుటుంబం మోచేతి నీళ్లు తాగే trs నేతలారా.. మీది మాటల ప్రభుత్వం మాత్రమే తెలంగాణ కు ఎప్పటికప్పుడు కేంద్రం నిధులిస్తోంది.

కేసీఆర్ ది ఒక తొండి ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టు లోని వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి?తెలంగాణలో రహదారుల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టాం.వరంగల్ నుంచి జగిత్యాల వరకు 4 వరుసల రహదారుల నిర్మాణం కోసం రూ.4 వేల కోట్ల పై చిలుకు ఖర్చు చేస్తున్నాం.
వరంగల్ నుంచి ఖమ్మం వరకు 4 వరుసలు రహదారుల నిర్మాణం కోసం రూ.3360 కోట్లు,రూ.20,000 కోట్ల పై చిలుకు కేవలం రోడ్ల నిర్మాణం కోసమే బీజేపీ ఖర్చు చేస్తోంది. రామప్ప దేవాలయం కు యునెస్కో గుర్తింపు తెచ్చిన ఘనత మోడీదే.వేయి స్తంభాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నాం. వేయి స్తంభాల గుడిలో మంటపం కూలిపోతే… ఇప్పటివరకు కేసీఆర్ పట్టించుకోలేదు. డిసెంబర్ లోపు వేయి స్తంభాల గుడిలో మంటపం నిర్మిస్తాం.

వరంగల్ పోర్టుకు రూ.5 కోట్లు కేటాయించాము.కాజీపేట లో రైల్వే ఒరాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటు కోసం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకూ… భూమి కేటాయించలేదు.తెలంగాణలో డిఫెన్స్ కు సంబంధించిన సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నాం.రూ.800 కోట్లతో అమ్మ5వరంగల్ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం.హెరిటేజ్, స్మార్ట్, అమృత్ సిటీ లను ఈ ప్రాంతానికి ఇచ్చాం.రూ.200 కోట్లతో ‘MSME Technical Center’ ఏర్పాటు చేస్తాం అంటే.. గత 3 సంవత్సరాలుగా భూమి కూడా ఇవ్వలేదు.

వరంగల్ జిల్లా కు కేసీఆర్ ఎంత ఖర్చు పెట్టాడో… సమాధానం చెప్పాలి.తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులపై చర్చకు మేము సిద్ధం.కేసీఆర్…. నీకు కళ్ళుంటే చూడు, చెవులు ఉంటే విను, కాళ్ళు ఉంటే తిరుగు.కేసీఆర్…. నీకు కళ్ళుంటే చూడు, లేకుంటే… నా దగ్గరికి రా.కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోస్తే… బీజేపీ ప్రభుత్వం వస్తుంది.

తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వస్తే… గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఇస్తాం.మతపరమైన రిజర్వేషన్లు ఎత్తేస్తాం. Trs ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి, ఆ కుటుంబాన్ని ఫార్మ్ హౌజ్ కే పరిమితం చేస్తాం.

LEAVE A RESPONSE