Suryaa.co.in

Andhra Pradesh

పేదలను పట్టాల పేరుతో మోసం చేస్తే సహించం

-దొంగ పట్టాలిస్తూ ప్రజలను దగా చేస్తున్నారు
-మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిక
-పేర్ని నాని ఇచ్చిన దొంగ ఇళ్ల పట్టాలపై టీడీపీ ధర్నా
-మచిలీపట్నం తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన మాజీమంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం: వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తన కుమారుడిని అందలం ఎక్కించడానికి రకరకాల నాటకాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నాడు. మచిలీపట్నం ఎమ్మార్వో ఆఫీస్ లో అర్ధరాత్రి వరకు కూర్చొని స్వయంగా పట్టాలు చేయించాడు. దొంగ పట్టాలిస్తూ ప్రజలను దగా చేస్తున్నారు. స్మశానానికి స్ట్రీట్ ఫీల్డ్స్ అని, మడుగు పోరంబోకు స్థలాలకి పట్టాలిస్తూ.. కొడుకును అందలం ఎక్కించడానికి పట్టపగలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.

15 రోజుల క్రితమే దీనిపై కలెక్టర్ కి ఎంక్వయిరీ చేయమని వినతిపత్రం అందజేయడం జరిగింది. చట్ట ప్రకారం చల్లని భూములకు పట్టాలిస్తూ ప్రజలను ముంచుతున్నాడు. సెంటు భూమి అని చెప్పి దిక్కు మొక్కు లేని స్థలాలను అప్పజెప్పారు. 3,500 జి ప్లస్ -3 ఇల్లు కడితే, ఇప్పటివరకు దాన్ని ప్రజలకు అందించలేదు. తక్షణమే ప్రజలను మోసం చేస్తూ పట్టాలు ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలని తహసిల్దార్ కార్యాలయం ముందు నాయకులు కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. తక్షణమే ప్రజలకు న్యాయం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతా.

LEAVE A RESPONSE