Suryaa.co.in

Andhra Pradesh

అవినీతి సొమ్ముతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న జగన్ రెడ్డి

-బ్రోకర్ పనులు చేసేందుకే సజ్జలను సలహదారుగా పెట్టారు
-అభ్యర్ధుల నుంచి దాదాపు రూ.1,000 కోట్లు వసూలు చేసిన సజ్జల
-సజ్జల చీకటి మాఫియాను వెలుగులోకి తెచ్చిన వైసీపీ నేత మల్లెల రాజేష్
-టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు

రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డికి ఓటమి ఖాయమని టిక్కెట్ల దుకాణానికి తెరలేపారు. సీట్లు అమ్ముకుంటూ కోట్లు వెనకేసుకుంటున్నారు. అవినీతి సొమ్ముతో నెగ్గుకురావచ్చని పగటి కలలు కంటున్నారు. ఒక వైపు ఓటర్లకు గిఫ్టులు పంచుతూ మరో వైపు అభ్యర్ధుల దగ్గర నుంచి డబ్బులు గుంజుతూ ఎన్నికల వ్యవస్థను ప్రహసనంలా మార్చేస్తున్నారు.

సజ్జల లాంటి బ్రోకర్లను పెట్టుకొని జగన్ రెడ్డి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు, పైరవీలు, సెటిల్ మెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా సజ్జల మారారు. బ్రోకర్ పనులు చేస్తూ, డబ్బులు వసూలు చేసి తాడేపల్లి ప్యాలెస్ కి తరలించేందుకే సజ్జలను ప్రభుత్వ సలహదారునిగా జగన్ రెడ్డి పెట్టుకున్నారు.

చిలకలూరిపేట వైసీపీ అభ్యర్ధిగా మల్లెల రాజేష్ నాయుడుని నియమించినందుకు మంత్రి రజిని, సజ్జల రూ.6.5 కోట్లు తీసుకోవడం సిగ్గుచేటు. అంటే ఒక్కో అభ్యర్ధి నుంచి ఇంత వసూలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్ధుల నుంచి రూ.1,000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కి చేరవేసిన సజ్జల. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి విడదల రజనీపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

LEAVE A RESPONSE