Suryaa.co.in

Andhra Pradesh

సీఎం జగన్‌ ప్రజల చెవుల్లో పూలు పెట్టారు

– అమరావతిలో వినూత్న నిరసన

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాజధానిలో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో తమకు ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి జగన్‌..ప్రజల చెవుల్లో పూలు పెట్టారని రైతులు ఆరోపించారు. తుళ్లూరు మండలం వెంకటాపాలెంలో జగన్‌ తీరును నిరసిస్తూ రైతులు చెవుల్లో పూలు పెట్టుకొని ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తుళ్లూరు దీక్షా శిబిరంలోనూ ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు..

LEAVE A RESPONSE