18 తర్వాతనే నోటిఫికేషన్?

సార్వత్రిక ఎన్నికల నోటిపికేషన్ ఈ నెల 18 తర్వాతనే వచ్చే అవకాశం ఉన్నట్లు ఉన్నతాధికారులు అంటున్నారు. ఎన్నికల ఫై నిర్ణయం తీసుకోవడానికి ఎన్నికల కమిషన్ లో కోరం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక కమిషనర్ రాజీనామా చేయడం ప్రధాన కారణం తెలుస్తోంది.ఈ నెల 14 న నూతన కమిషనర్ నియామకం ఎంపిక తర్వాత జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17 న చిలకలూరుపేటలో జరిగే ఎన్ డి ఏ మొట్ట మొదటి బహిరంగ సభ ఉంది. ఈ సభలో ప్రధాన మంత్రి మోడీ పాల్గొనే అవకాశం ఉంది. ఆ తర్వాత రోజు ఎన్నికల నోటిపికేషన్ వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply