– మాజీ మంత్రి కొప్పుల
హైదరాబాద్: శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీ ఎస్టీ బిసి బడుగు, బలహీన వర్గాలను మోసం చేసేలా ఈ బడ్జెట్ ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు ఆరు గ్యారెంటీల ఊసే లేదని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.ఎస్సీ ఎస్టీ బిసి బడుగు, బలహీన వర్గాలను మోసం చేసేలా ఈ బడ్జెట్ ఉందని మండిపడ్డారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో ఇచ్చిన దళిత బంధు కు బదులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న అంబేద్కర్ అభయ హస్తం పథకం కింద 12 లక్షలు ఇస్తామన్నారు.. కానీ ఎలాంటి ఊసే లేదు.. అంటే దళిత బంధు కు రాం రాం చెప్పేసినట్లేనా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితులను నమ్మించి వెన్నుపోటు పొడిచే పార్టీ అని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ప్రస్తావనే లేదు.నమ్మి ఓట్లేసిన పాపానికి 4 కోట్ల మందిని మోసం చేసిన బడ్జెట్ ఇది. గత పదేండ్ల ప్రగతి కి గండి పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి చేతకాని పాలనాకు నిలువుటద్దం ఈ బడ్జెట్.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న తులం బంగారం, మహాలక్ష్మి, పెన్షన్ల లకు దిక్కు లేదు.అంతే కాకుండా ఈ ప్రభుత్వం యాదవ సోదరులకు గొర్రెలు ఇస్తామని నమ్మబలికి వారి ప్రస్తావనే లేదు. ఆ పథకం ఊసే లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గురుకులాల్లో 80 మందికి పైచిలుకు పిల్లలు చనిపోతే ఆపలేని వీళ్ళు.. కొత్త స్కూల్స్ ను నిర్మిస్తాం అనడం విడ్డూరంగా ఉందన్నారు.