Suryaa.co.in

Family

అబ్బాయి లేదా అమ్మాయికి కుజ దోషమా?

– అన్నీ బాగున్నాయి కానీ నక్షత్రం ఒక్కటే నప్పడం లేదా?
– కంగారు పడవద్దు… మరేం పర్వాలేదు

వివాహ విషయంలో తల్లితండ్రులు తెలియక కొన్ని తప్పులు చేస్తున్నారు! అమ్మాయికి, కాని అబ్బాయికి కాని ఏదైనా సంబంధం రాగానే ముందు నక్షత్రం ఏమిటని అడిగి, నక్షత్రం చెప్పగానే వెంటనే మా అమ్మాయికి సరిపోదు అండి ఈ నక్షత్రం అని చెప్తున్నారు! కాని అది శుద్ధ తప్పు. ఒక్క నక్షత్రంతోనే జాతకాన్ని కుదరలేదని ఎలా చెప్తారు?

నక్షత్రాన్ని తారబలం అంటారు! బలం అనగా నక్షత్ర బలం అని అర్ధం! నక్షత్ర బలం 10% మాత్రమే ఉంటుంది తప్ప ఎక్కువ శాతం ఉండదు! జాతకంలో కూడ పూర్తి 100% కుదిరే జాతకాలు ఏవి ఉండవు వధూ వరుల ఇద్దరి జాతకాలు పరిశీలించి నిర్ణ యం తీసుకోవాలి! అమ్మాయి నక్షత్రాన్ని బట్టే తారాబలం చూడాలి, అబ్బాయి నక్షత్రానికి నైధన తార, విపత్ తార కాకుండా వుంటే చాలు.

జాతకంలో కుజదోషమని భయపడి, భయ పెట్టకూడదు! ఎందు కంటే కుజదోషానికి జాతకంలో చాలా పరిహారాలు ఉన్నా యి. కొన్ని స్థానాల్లో ఉంటే కుజదోషం వర్తించదు.కుజదోషం ఉన్నవారికి ఉన్నవారితో, లేనివారికి లేనివారితో చేస్తే సరిపోతుంది! అందువలన జాతక పొంతన ఇప్పటి రోజుల్లో కనీసం 50% కుదిరిన చాలు.

నక్షత్రం కుదిరినా, కుదరక పోయినా, జాతకంలో, సౌభాగ్య స్థానం, సంతాన స్థానం, కుటుంబ స్థానం, గృహ యోగం తిండికి, గుడ్డకు లోటు లేని చూస్తే అవి బాగుంటే చాలు. అమ్మాయి జాతక రీత్యా అబ్బాయికి అభివృద్ధి ఉందా? లేదా?. జరుగుతున్న దశ బలం గా ఉందా! లేదా? పంచాంగం లో బిందువులు, గణాలువంటి చిన్న విషయాలు కుదరక పోయినా ఫరవాలేదు ఎందుకంటే వాటికీ 5% ఫలితం తప్ప ఉండదు! దగ్గిరకు వచ్చిన సంబంధములు దయచేసి Cancell చేసుకోవద్దు! శాస్త్ర అనుభవం ఉన్నవారి దగ్గిరకు వెళ్లి గట్టి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే తల్లి తండ్రులకు కావాల్సింది ఏమిటి… వాళ్లిద్దరూ సుఖంగా ఉండాలి! ఉంటే తల్లితండ్రులు సుఖంగా ఉంటారు. మీరు నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి అలోచించి మంచి నిర్ణయం తీసుకొని, వివాహాలు చేయండి!

జాతకంలో ముఖ్యమైన పొంతన చూసి వివాహాలు చేసి కన్యాదానం ఫలితం పొందండి! తల్లి తండ్రులు ఆలోచించి పిల్లల వివాహాల విష యంలో తగు నిర్ణయం తీసుకొని, ఉత్తమ ఫలితాలు, శుభ ఫలితాలు పొందండి! తెలిసీ తెలియని అవిజ్ఞానంతో వివాహాలు చెడగొట్టు కోవద్దు!

– రవీంద్రనాధ్‌ మంతా

LEAVE A RESPONSE