Suryaa.co.in

Andhra Pradesh

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి లక్ష్మీ పార్వతి

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీసును ఆయన సతీమణి లక్ష్మీపార్వతి సందర్శించారు. జిల్లాకు తన భర్త పేరు పెట్టడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేయలేని పని జగన్ చేశారని కితాబిచ్చారు. లక్ష్మీపార్వతి ఏమన్నారంటే…

ఎన్టీఆర్ కు దండలు వేస్తారు..పొగుడుతారు.కానీ శాశ్వతంగా ఒక్క మంచి పని కూడా చంద్రబాబు చేయలేదు.ఆయన దగ్గర నుంచి పార్టీ లాక్కున్నారు. జగన్ కి ఎన్ఠీఆర్ తో ఎలాంటి సంబంధం లేదు.ఆయన గురించి తెలియకపోయినా సీఎం మంచి నిర్ణయం తీసుకున్నారు.జిల్లాల పేర్లతో పెద్దల ఆశీస్సులు సీఎం కి ఉంటాయి.చంద్రబాబు చేయలేని పని జగన్ చేస్తున్నారుమీ నాయకుడు చేయలేని పని మా నాయకుడు చేశారు.

ఎన్టీఆర్ జిల్లా ఏపీలోనే మంచి పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నా. ఎన్ఠీఆర్ పుట్టింది నిమ్మకూరు అయినా విజయవాడతో ఎక్కువ అనుబంధం ఉంది. నిమ్మకూరు ఒక మూలన ఉన్న పల్లెటూరు…విజయవాడ అందరికీ తెలిసిన పేరు.

LEAVE A RESPONSE