– టీడీపీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు
– అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పిల్లి మాణిక్యాలరావు
మంగళగిరి : వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వెంకట రాధ సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. గతంలో ప్రభుత్వ తమకు భూమి మంజూరు చేసింది ఆ భూమిలో సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. తమ గ్రామంలో కొంతమంది తమ భూమిని ఆక్రమించి కోర్టులో వేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆన్ లైన్ లో తమ పేరు తొలగించి భూమి వద్దకు తమను రాకుండా అడ్డుకున్నారు.
కోర్టు పరిధిలో ఉంది తమ భూమిని సాగు చేయకూడదని రెవెన్యూ అధికారులతో చెప్పింది.. ఇప్పుడు వారు ఆ భూమిని సాగు చేసేందుకు సేద్యం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులతో భూమి కొలతలు వేయిస్తున్నారు. ఆక్రమణదారులకు ఎలాంటి పత్రాలకు లేకున్న అధికారులు వారికి సహకరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోని తమ భూమిని తమకు పేరుతో ఆన్ లైన్ లో నమోదు చేయించాలని నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఏపీ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావులకు అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.
బాపట్ల జిల్లా మార్టూరు మండలం డేగలమూడి గ్రామానికి చెందిన సాంబయ్య గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో 2020లో గత ప్రభుత్వ హయాంలో పేదలకు గృహ నిర్మాణం కోసం ప్రభుత్వం లేఅవుట్ వేయగా, ఆ లేఅవుట్ స్థలాలను వైసీపీ నాయకుడు జంపని వీరయ్య అక్రమంగా కబ్జా చేసి తన కోడలిపేరిట ఇల్లు మంజూరు చేయించుకొని నిర్మాణం చేపట్టాడు.
అంతేకాకుండా లేఅవుట్‌కు కేటాయించిన ప్రభుత్వ మోటారు పంపును తన ఇంటి అవసరాలకు వాడుకుంటూ, లబ్ధిదారుల కోసం కేటాయించిన మెటీరియల్‌ను బలవంతంగా లాక్కొని తన ఇంటి నిర్మాణానికి ఉపయోగించాడు. దీని వలన నిజమైన లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకోలేకపోయారు. కొంతమందికి డబ్బు చూపించి వారి స్థలాలను బలవంతంగా లాక్కోవడమే కాకుండా, స్థల ధ్రువీకరణ పత్రాలపై వైట్నర్ రాసి వేరే పేర్లు వ్రాసి ఖాళీ స్థలాలను అమ్మడం వంటి అక్రమాలు చేశాడు. కావునా వారిపై చర్యలు తీసుకోని అర్హులైన వారికి న్యాయం చేయాలని కోరాడు.
కర్నూలు జిల్లా, కోడుమూరు మండలం వర్కూర్ గ్రామానికి చెందిన హనుమంత్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో తమకు 4 ఎకరాల 9 సెంట్ల భూమి కలదు. వైసీపీ ప్రభుత్వంలో సర్వే నెం. 91-3లో ఎకరం భూమిని వైసీపీ కార్యకర్తలకు ఆన్ లైన్ లో ఎక్కించారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కా తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
కర్నూలు జిల్లా, నందవరం మండలం టి.సోమలగూడూరు గ్రామానికి చెందిన నాగేష్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో టి.తిమ్మప్ప, టి.రాముడు, గోఖరి అనే వారు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తిమ్మప్ప అనే వ్యక్తి ఏరోజు వ్యవసాయం చేయలేదు. కానీ తమ తాత పెద్ద కుమారుడు అయినందు ఆయన భార్య టి.నరసమ్మ గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా ఆన్ లైన్ లో నమోదు చేసుకోని ఇతరుల పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు. వారిపై చర్యలు తీసుకోని అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాల్సిందిగా కోరారు.
వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్లకు చెందిన గురు వినీత్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ తండ్రి ఆర్మీలో జవాన్ గా పనిచేసి 2005లో రిటైర్ అయ్యారు. కాశీనాయన మండలం ఓబులవారిపల్లి రెవెన్యూ గ్రామంలో సర్వే నెం. 1లో 5.00 ఎకరాలు అసైన్డ్ భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి సంబంధించి అసైన్డ్ ఢీఫారం పాసుపుస్తకాలు ఇచ్చింది. పొలం హద్దులు చూపలేదు. తమ తండ్రి 2020లో మరణించారు. భూమి హద్దుల కోసం పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశాం.. కానీ ఎలాంటి చర్యలు లేవు. తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.