– బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామ్ చందర్ రావు పిలుపు
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి పాదయాత్ర కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామ్ చందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వెంగల్రావు నగర్ డివిజన్లోని యాదగిరినగర్ కమాన్, ఎస్.జి.బి పాఠశాల సమీపం నుంచి ఈ పాదయాత్ర ఆరంభమైంది. ఈ సందర్భంగా రామ్ చందర్ రావు మాట్లాడారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. ఇది కేవలం ఉపఎన్నిక మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు ప్రతీక అని చెప్పారు.