Suryaa.co.in

Andhra Pradesh

ఆదర్శ మంగళగిరి కోసం కదలివస్తున్న నాయకులు

లోకేష్ సమక్షంలో 100 కుటుంబాలు టిడిపిలో చేరిక

ఉండవల్లి: ఆదర్శ మంగళగిరి కోసం అందరూ కలసిరావాలన్న యువనేత లోకేష్ పిలుపునకు నియోజకవర్గం నలుమూలల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వివిధ పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాడేపల్లి రూరల్ పెనుమాక గ్రామానికి చెందిన 40 కుటుంబాలు, మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన 60 కుటుంబాలు శనివారం టిడిపిలో చేరాయి.

పార్టీలోకి నూతనంగా చేరిన వారికి ఉండవల్లి నివాసంలో యువనేత లోకేష్ పసుపుకండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. మంగళగిరి సమగ్రాభివృద్ధి కోసం కలిసివచ్చే ప్రతిఒక్కరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాక అందరికీ తగిన ప్రాధాన్యతనిచ్చి గౌరవిస్తామని లోకేష్ తెలిపారు.

తాడేపల్లి రూరల్ మండలం పెనుమాక గ్రామానికి చెందిన వైసిపి నాయకులు మండలనేని లక్ష్మీనారాయణ(ఎంఎల్ఆర్), నెమలకంటి సాంబశివరావు, వలపర్ల ప్రసాద్, మాలావత్ రవినాయక్, తాడిబోయిన సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో 40 కుటుంబాలు, మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన తమ్మిశెట్టి రమణయ్య, సంపూర్ణమ్మ, బత్తుల సంజీవయ్య, తమ్మిశెట్టి నాగేశ్వరరావు, దేవళ్ల పెద వెంకయ్య ఆధ్వర్యంలో 60 కుటుంబాలు టిడిపిలో చేరాయి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్యనేతలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE