– ఉప ఎన్నికలో గెలుపే ప్రధానంగా పనిచేద్దాం
– సమిష్టి కృషితో బీజేపీని గెలిపిద్దాం
– జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి భాగ్యనగరంలోని 8 జిల్లాల ప్రధాన నాయకుల సమావేశం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
– పార్టీ బలోపేతం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, బూత్ స్థాయి సమన్వయం వంటి కీలక అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం
హైదరాబాద్ : ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టంగా, సమన్వయంతో పనిచేసి బిజెపి విజయానికి కృషి చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సూచించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి, బీసీలకు న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తుందని పూర్తి నమ్మకం ఉంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లోనూ బిజెపి గెలుస్తుంది. ప్రజలు బిజెపిని ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరాన్ని వరల్డ్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పి.. విషాదనగరంగా మార్చింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని కనుమరుగు చేసింది.
వరదల, భారీ వర్షాల సమయంలో ప్రజల అత్యవసర అవసరాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా లోపం స్పష్టమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదు. ప్రధాన మార్గాలు, డ్రైనేజీ వ్యవస్థలు, రోడ్ల నిర్వహణపై నిర్లక్ష్యం చేస్తోంది. ఇటీవల తెరిచిన మ్యాన్‌హోల్ ప్రమాదాలతో పిల్లలు మృతిచెందిన ఘటనలు చూశాం.
కాంగ్రెస్ ప్రభుత్వ భాద్యతా రాహిత్యంతోనే రామంతపూర్ లో విద్యుత్ షాక్ కు గురై ఆరుగురు మృతిచెందారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు హైదరాబాద్ నగరాన్ని నిర్లక్ష్యం చేశాయి. కేవలం ఓటుబ్యాంకు రాజకీయాల కోసం మజ్లిస్ తో కలిసేందుకు రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం జంట నగరాల పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను పెంచి పేద, సామాన్య ప్రజలపై భారం మోపింది. నాడు బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేశారు. అయినా ఉద్యోగులపై బీఆర్ఎస్ సర్కారు చూపిన కర్కశత్వం తెలంగాణ సమాజం ఇప్పటికీ మరువలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ప్రకటనలు చేస్తూనే మరోవైపు బస్సు చార్జీలు పెంచడం దారుణం. ఒక చేత్తో ఫ్రీ ఇచ్చి మరో చేత్తో బస్ టికెట్ ధరలు పెంచి సామాన్యులు, పేదలపై భారం మోపడం ఎంతవరకు న్యాయం?
ఇటీవల నగరంలో ముస్లిం ఖబ్రస్తాన్ (శ్మశానవాటిక) ఏర్పాటుకు రక్షణ శాఖ భూములను కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఒకవైపు హిందూ దేవాలయాలను కూలగొడుతున్నారు. హిందువులకు రక్షణ లేకపోవడం బాధాకరం. జూబ్లీహిల్స్ అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు లేదు. మరో రెండు మూడు రోజుల్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కు సంబంధించి బిజెపి అభ్యర్థిని ప్రకటిస్తాం.
మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న చీకటి సంబంధాలను, చీకటి ఒప్పందాలను ఎండగట్టాలి. బిజెపి నాయకులు, కార్యకర్తలు అందరూ సమిష్టి కృషితో బిజెపిని గెలిపించేలా పనిచేయాలి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ ని గెలిపించి ప్రధాని నరేంద్ర మోదీ కి గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుతున్నా.