Suryaa.co.in

Political News

`ఎదుగూరి సందింటి` మిస్ట‌రీ డెత్స్‌పై మాట్లాడ‌దామా?

.- రాజారెడ్డి చేయించిన మ‌ర్డ‌ర్లు, చంద్ర ప్రతాప్ రెడ్డి రోడ్ యాక్సిడెంట్‌,ఈసీ గంగిరెడ్డి, అనుమానాస్ప‌ద మ‌ర‌ణం, విజయసాయి పెద్దనాన్నహత్యపై మాట్లాడదామా?
( జీఎన్‌ఆర్‌)

అనారోగ్యం, డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతూ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన ఎన్టీఆర్ చిన్న‌కుమార్తె ఉమామ‌హేశ్వ‌రి మ‌ర‌ణంతో కుటుంబ‌మంతా శోక‌సంద్రంలో ఉంటే… విషం చిమ్ముతోన్న జ‌గ‌న్‌రెడ్డి, సాయిరెడ్డి, కిరాయి మూక‌లూ ఎదుగూరి సంధింటికి సంబంధించిన అనుమానాస్ప‌ద మిస్ట‌రీ మ‌ర‌ణాల‌పై మాట్లాడదామంటూ నెటిజ‌న్లు స‌వాల్ విసురుతున్నారు. ఎక్క‌డ నుంచి మొద‌లు పెడ‌దామంటూ ఒక జాబితా విడుద‌ల చేశారు.
తాత రాజారెడ్డి చేసిన హ‌త్య‌లు…రాజారెడ్డి చేయించిన మ‌ర్డ‌ర్లు…చివ‌రికి హ‌త్య‌కి గురైన తాత గురించి మాట్లాడుదామా జ‌గ‌న్‌రెడ్డి.

ష‌ర్మిల మేన‌మామ క‌మ్ మొద‌టి భ‌ర్త‌ చంద్ర ప్రతాప్ రెడ్డికి బ‌ల‌వంతంగా విడాకులు ఇప్పించాక, ప్ర‌భాస్‌తో యోగి సినిమా నిర్మాత‌గా కూడా చంద్ర‌ప్ర‌తాప్‌రెడ్డి వ్య‌వ‌హ‌రించారు. అనిల్‌ని పెళ్లి చేసుకున్నాక విచిత్రంగా రోడ్ యాక్సిడెంట్‌లో ష‌ర్మిల మాజీ భ‌ర్త‌, యోగి నిర్మాత చంద్ర ప్రతాప్ రెడ్డి చ‌నిపోయారు. ఇప్ప‌టికీ వీడ‌ని ఈ మిస్ట‌రీ గురించి మాట్లాడుకుందామా జ‌గ‌న్‌రెడ్డి.

రిల‌య‌న్స్ వాళ్ల‌ని 10 వేల కోట్లు లంచం అడిగాడ‌ని వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని చంపేశార‌ని ల‌బోదిబోమ‌ని ఏడ్చాడు. రిల‌య‌న్స్ బంకులు త‌గ‌ల‌బెట్టించాడు. పావురాల గుట్ట నుంచి వ‌చ్చిన మాంసం మూట‌ని అంత్య‌క్రియ‌లు చేయ‌కుండా…సీఎం కావాల‌ని సంత‌కాలు సేక‌రించుకున్నాడు. చివ‌రికి సీఎం అయ్యాడు. త‌న తండ్రిని చంపార‌ని ప్ర‌చారం చేసిన రిల‌య‌న్స్ వాళ్ల‌ని ఇంటికి పిలిచి, రాజ్య‌స‌భ సీటు ఇచ్చి స‌న్మానించాడు. ఈ హ‌త్య గురించి లోతైన చ‌ర్చ జ‌ర‌గాలి జ‌గ‌న్‌రెడ్డి గారూ..

అది 1945 సంవ‌త్సరం. స్వాతంత్య్రం కోసం పోరాడుతూ అంతా జైళ్ల‌లో మ‌గ్గుతుంటే… విజయసాయిరెడ్డి తండ్రి సుందరరామిరెడ్డి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని, త‌న అన్న‌ని చంపేసి జైలుకెళ్లాడు. మీ నాన్న మీ పెద‌నాన్న‌ని ఆస్తి కోసం చంపేయ‌డంపై మాట్లాడుకుందామా క‌సాయిరెడ్డి గారూ… వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి త‌మ్ముడు వైఎస్ వివేకానంద‌రెడ్డి సొంత ఇంట్లో గొడ్డ‌ళ్ల‌తో అత్యంత దారుణంగా చంపేసి గుండెపోటుగా ప్ర‌క‌టించిన మీ ముంద‌స్తు ప్లాన్‌పై అనుమానాలున్నాయి. సీబీఐ ద‌గ్గ‌ర‌కెళ్లి ఒక్క‌సారి క్లారిటీ ఇవ్వండి ఏ2 గారూ..

బాబాయ్‌కి గుండెపోటు వ‌స్తే, గొడ్డ‌లితో గుండెని రుద్ద‌డం వ‌ల్ల చ‌నిపోయాడ‌ని, గుండెపోటుకి త‌ల‌కి క‌ట్టు క‌ట్టిన పిల్ల‌నిచ్చిన మామ ఈసీ గంగిరెడ్డి అనుమానాస్ప‌ద మ‌ర‌ణంపై చ‌ర్చించాల్సి ఉంది జ‌గ‌న్‌రెడ్డి గారూ..
వివేకా హత్యకేసులో అనుమానితుడిగా ఉన్న కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన కటికరెడ్డి శ్రీనివాసులురెడ్డి (57) ఆత్మహత్యగా న‌మోదు చేయించారు కానీ…అది వివేకాని వెంటాడిన గొడ్డ‌లి హ‌త్య‌నేనంటున్నారు..సీబీఐకి తీగ‌లాగితే డొంక ఎక్క‌డ క‌దులుతుందో తెలుసా జ‌గ‌న్‌రెడ్డి గారూ…

వివేకా హ‌త్య‌కేసులో నిందితుడితో సీబీఐపై రివ‌ర్స్ కేసులు పెట్టించి. మీ గ్యాంగ్ చంపేసిన‌ కల్లూరు గంగాధర్‌రెడ్డిని అనారోగ్యం ఖాతాలో క‌లిపేసిన అనుమానాల‌పై ఒక ట్వీట్ వేయండి వేశ్యారెడ్డి గారూ… ఏ మ‌ర్డ‌ర్ నుంచి మొద‌లు పెడ‌దామో మీ ఇష్టం…ఎదుగూరు సంధింటిలో జ‌రిగిన ఇన్ని అనుమానాస్ప‌ద మ‌ర‌ణాల‌పై మీకెప్పుడూ అనుమానం రాక‌పోవ‌డం. మీపైనే అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి ఏ1 అండ్ ఏ2 రెడ్డి గార్లు..

LEAVE A RESPONSE