– ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
– 4వ డివిజన్ లో లోకేష్ జన్మదిన వేడుకలు
– కేక్ కట్ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా , ఎంపి కేశినేని , ఎమ్మెల్యే గద్దె
– సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
విజయవాడ : క్రమశిక్షణ, పట్టుదల కార్యదక్షతకు మారుపేరు మంత్రి నారా లోకేష్ అని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. విద్య,ఐటీ శాఖల మంత్రిగా ప్రజాభివృద్ది ధ్యేయంగా సేవలందిస్తూ ప్రజా నాయకుడిగా నారా లోకేష్ మన్ననలు అందుకోవటం ఎంతో ఆనందంగా వుందన్నారు.
తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ లోని శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీ లో జరిగిన మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్, ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని కేక్ కట్ చేశారు. మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ ప్రాంతంలో రూ.19.92 లక్షలతో నిర్మించనున్న దీప్తి భవన్ సిసి రోడ్డు నిర్మాణ పనులకు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్, ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, కార్పొరేటర్ దేవినేని అపర్ణ, టిడిపి నాయకులు జాస్తి కృష్ణారావు, గోపాలకృష్ణ, యలమంచిలి రాజా, యలమంచిలి రాజేంద్రప్రసాద్, కోడూరి ఆంజనేయ వాసు, సర్కిల్ 3 ఈఈ స్రామాజ్యం,డి.ఈ రామారావు, ఎ.ఈ దీక్షిత్ లతో పాటు ఎన్డీయే నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.