Suryaa.co.in

Andhra Pradesh

నెక్స్ట్ ఏంటి? రౌడీ షీట్ ఓపెన్ చేస్తావా? దేనికైనా రెడీ

– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

ఇంత పిరికివాడివేంటి జగన్ రెడ్డి? ప్రశ్నిస్తే కేసు పెడతానంటే ప్రశ్నిస్తూనే ఉంటా. హత్యాయత్నంతో పాటు 11 కేసులు పెట్టావ్. ఇప్పుడు కళ్యాణదుర్గంలో మరో కేసు. నీలా ప్రజల సొమ్ము దొబ్బినందుకు నా పై కేసులు లేవు. ప్రజల పక్షాన నిలబడినందుకు మాత్రమే నా పై కేసులు ఉన్నాయి. మంత్రి పర్యటన సందర్భంగా ఓవర్ యాక్షన్ చేసి దళిత చిన్నారిని బలిగొన్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చెయ్యమని అడిగిన నాపై కేసు పెట్టారు. బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడినందుకు 12 కేసులు పెట్టావ్…నెక్స్ట్ ఏంటి? రౌడి షీట్ ఓపెన్ చేస్తావా? దేనికైనా రెడీ.

LEAVE A RESPONSE