Suryaa.co.in

Andhra Pradesh

కందుకూరు నియోజకవర్గంలో దుమ్మురేపిన యువగళం

-వలేటివారిపాలెం బహిరంగసభకు పోటెత్తిన జనసంద్రం
-కొండపిలోకి ప్రవేశించిన పాదయాత్ర… యువనేతకు ఘనస్వాగతం

కందుకూరు: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దుమ్మురేపింది. 156వరోజు వెంగళాపురం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. మహిళలు హారతులు పడుతూ యువనేతకు గ్రామాల్లోకి స్వాగతించారు. వలేటివారిపాలెంలో నిర్వహించిన బహిరంగసభ జన ప్రభంజనాన్ని తలపించింది. రోడ్లన్నీ కిటకిటలాడటంతో జనం డాబాలపైకి ఎక్కి యువనేత ప్రసంగాన్ని ఆలకించారు. దారిపొడవునా మహిళలు, యువకులు యువనేతకు ఎదురేగి తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకున్నారు. మరికొద్దినెలల్లో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలు తీరుస్తుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. వెంగళాపురం, బంగారక్కపాలెం, వలేటివారిపాలెం, లింగపాలెం, రామచంద్రపురం మీదుగా కొండపి అసెంబ్లీ నియోజకర్గంలోకి అడుగుపెట్టిన యువనేతకు ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య నేతృత్వంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. భారీ గజమాలలతో యువనేతను సత్కరించారు. 156వరోజు యువనేత లోకేష్ 12.8 కి.మీ. ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2070.1  కి.మీ. పూర్తయింది. సోమవారంనాడు మాలెపాడులో పాడిరైతులతో యువనేత లోకేష్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, వారి సాధకబాధకాలు తెలుసుకుంటారు.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

నిజాయితీగా పనిచేసేవారిని లూప్ లైన్ లో పెడుతున్నారు -మాలెపాడులో క్యాంప్ సైట్ లో పోలీసుల ఆవేదన
మాకు ఇంకా 2 డీఏలు పెండింగులో ఉన్నాయి. 4 డీఏలు పెండింగులో ఉండగా..యువగళం మొదలయ్యాక రెండు డిఎలు వదిలారు. సరెండర్స్ లీవ్స్ కూడా ఇంకా రెండు పెండింగులో పెట్టారు. జీపీఎఫ్ రుణాల మాటే లేదు. హెల్త్ అలవెన్సులు కూడా విడుదల చేయక సొంత డబ్బుతో వైద్యం చేయించుకుంటున్నాం. బదిలీల్లోనూ అవకతవకలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వంలో సిన్సియర్ గా పనిచేసేవారికి స్థానంలేదు. నిజాయితీతో పని చేసేవాళ్లను లూప్ లైన్ లో పెడుతున్నారు.

మంచినీళ్లలో మట్టిగడ్డలు వస్తున్నాయి! సుబ్బారావు, మాజీ ఉపసర్పంచ్, వలేటివారిపాలెం
మా గ్రామంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. టీడీపీ హయాంలో నీటి సమస్య పరిష్కారం కోసం రాళ్లపాడు ప్రాజెక్టు నుండి పైపు లైన్లు వేసి, శుద్ధిచేసిన నీటిని విడుదుల చేసేవాళ్లు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక శుద్ధి చేయడం లేదు. ప్రాజెక్టులో నీటిని నేరుగా సరఫరా చేయడంతో చిన్నపాటి మట్టిగడ్డలతో కలిసి కలుషితమవుతున్నాయి. తాగడానికి పనికిరాకపోవడంతో మినరల్ వాటర్ కొనుక్కొని తెచ్చుకుంటున్నాం.

స్కూలును గాలికి వదిలేశారు! -సుజాత, గాంధీ నగర్
 మాగ్రామంలో రోడ్డు వెంటే స్కూలు ఉంది. ఎంతో శుభ్రంగా ఉండాల్సిన స్కూలును అధ్వాన్నంగా మార్చారు. స్కూలు ముందు ఉన్న మోటారును భద్రత లేకుండా అలాగే వదిలేశారు. స్కూలు ముందే ఇసుక కుప్పలపై ముళ్ల కంప వేశారు. చూస్తే ఇది స్కూలా..లేక దొడ్డా అన్నట్లు ఉంది. వర్షం వస్తే మోటారుకు ఎర్త్ వచ్చే ప్రమాదం ఉంది. స్కూలుకు వెళ్లే రోడ్డుకు రెండు వైపులా మురికి నీళ్లు నిండి ఉన్నాయి.

పూటగడవడం కష్టంగా ఉంది! : నాగలక్ష్మీ, వలేటివారిపాలెం
మాకు సాగు చేసుకోవడానికి పొలం లేదు. కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. కరువుపనికి కూడా సరిగా కూలీ వేయడం లేదు. నా భర్తకు ఆరోగ్యం బాగోలేదు. ప్రస్తుతం ఏ పనికి వెళ్లాలన్నా రోజువారీ ఉండటం లేదు. నిత్యవసర సరుకుల ధరలు చూస్తే రోజురోజుకూ పెరుగుతున్నాయి. మొన్నటి దాకా కూరగాయలు కొనలేక పచ్చడితో తినేవాళ్లం. ఇప్పుడు పచ్చిమిర్చి రూ.160లు ఉంది. టమోటా, మిర్చి ధరలు తగ్గించాలి. పూటగడవడమే కష్టంగా ఉంది.

పారిశుద్ధ్య కార్మిక పోస్టుకు రూ.2 లక్షలు అడిగారు!: అడిపి పాండు, కందుకూరు
కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా మా అమ్మను చేర్చుదామని అడిగినే రూ.2 లక్షలు అడిగారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టాం, వాటిని రాబట్టుకోవడినికి తీసుకోవడం తప్పదని వైసీపీ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. అవికూడా పర్మినెంట్ ఉద్యోగాలు కాదు, ఔట్ సోర్సింగ్ పోస్టులు మాత్రమే. అంతడబ్బు కట్టే స్థోమత లేక ప్రస్తుతం మా అమ్మ హోటల్లో పనికి వెళ్తోంది.

డాటా దొంగ జగన్… మీ ఆస్తులు కొట్టేస్తాడు జాగ్రత్త!

యువగళానికి జనం లేరన్నారు… జన ప్రభంజనం చూసి వైసిపి వాళ్లు ప్యాంట్లు తడుపుకుంటున్నారు, యువగళం దెబ్బకి వైసిపి ప్యాకప్ ఖాయమని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెంలో జరిగిన బహిరంగసభలో నారా లోకేష్ మాట్లాడుతూ… జగన్ ప్రతి స్కీం వెనకా ఒక స్కాం ఉంటుంది.  గజదొంగ జగన్ ఇప్పుడు డేటా దొంగ అవతారం కూడా ఎత్తాడు. డేటా దొంగ జగన్ మీ ఇంట్లోకి వచ్చేసాడు. జాగ్రత్త మీ వ్యక్తిగత సమాచారం ఇస్తే మీకు ఉన్న ఆస్తులు కూడా కొట్టేయడం ఖాయం. సురక్ష అనగానే నాకు డౌట్ వచ్చింది. అది సురక్ష కాదు ప్రజల పాలిట శని అని మాజీ మంత్రి పేర్ని నాని తేల్చేసారు.  క్యాబినెట్ సమావేశం రోజు మాజీ మంత్రి పేర్ని నాని సచివాలయానికి వచ్చారు. అక్కడ ఉన్న మీడియా మిత్రులతో మాట్లాడారు.

ఆ సంధర్భంలో మీడియా మిత్రులు సురక్ష కార్యక్రమంలో వాలంటీర్లు వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారు, ఫింగర్ ప్రింట్ తో పాటు, ఏ పార్టీకి చెందిన వారు? సాక్షి కి అనుకూలమా? కాదా అనే వివరాలు కూడా సేకరిస్తున్నారు అని చెప్పారు. పాపం ఆయన నో నో అలా జరిగే ప్రసక్తే లేదు అంటూ వాలంటీర్ వాసు కి కాల్ కొట్టి లైవ్ లో నిరూపిస్తా అన్నాడు.  ఫోన్ చేసి వాలంటీర్ ని మీరు పార్టీ వివరాలు, వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారా? ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నారా? అని అడిగారు. వెంటనే ఆ వాలంటీర్ అవును సార్ ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నాం, సాక్షి కి , వైసిపి కి అనుకూలమా కాదా అని కూడా వివరాలు సేకరిస్తున్నాం అని చెప్పేసాడు. పాపం ఆ పిల్లాడికి ఆ ఫోన్ స్పీకర్ లో ఉందని తెలియదు. మీడియా వాళ్లు ఉన్నారు ఈయన ఫోన్ కట్ చేయలేడు. జగన్ ది పిల్ల కాలువ రేంజ్… చంద్రబాబు గారిది పోలవరం రేంజ్. పిల్ల కాలువ తవ్వడం రానివాడు పోలవరం పూర్తి చేస్తాడా? చంద్రబాబు గారు పోలవరాన్ని పరుగులు పెట్టించారు. సోమవారాన్ని చంద్రబాబు గారు పోలవరంగా మార్చుకొని 72 శాతం పనులు పూర్తిచేసారు. కమిషన్ల కక్కర్తి తో రివర్స్ టెండరింగ్ కి వెళ్లి ప్రాజెక్టుని ప్రమాదంలో పడేసాడు.  డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడానికి,గైడ్ బండ్ కుంగిపోవడానికి జగన్ కక్కుర్తే కారణం.

కందుకూరు కదంతొక్కింది!
కందుకూరు కదం తొక్కింది,  రాజుల రాజధాని ఈ స్కందపురి. జనార్దనస్వామి ఆలయం, స్కంధపురి సోమేశ్వర ఆలయం,  శ్రీ మాల్యాద్రి నరసింహ స్వామి ఆలయం ఉన్న పుణ్య భూమి కందుకూరు. ఉలవపాడు మామిడి ప్రపంచం మొత్తం ఫేమస్. ఎంతో ఘన చరిత్ర ఉన్న కందుకూరు నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. యువగళం..మనగళం..ప్రజాబలం. చిత్తూరు జనసంద్రంగా మారింది. అనంతపురం అదిరిపోయింది. కర్నూలు కదం తొక్కింది. కడప కసి పెంచింది. నెల్లూరు నాటు దెబ్బకి వైసిపి దిమ్మతిరిగిపోయింది.  ప్రకాశం పోటెత్తింది.

పిన్నమ్మ తాళి తెంచింది ఎవరు?
జగన్ స్పెషల్ ఫ్లైట్ లో మళ్లీ ఢిల్లీ ఎందుకు వెళ్లాడు? మొదటి ఆప్షన్ బాబాయ్ మర్డర్ కేసులో ఏ8 అవినాష్ కి కాపాడటానికి.  రెండో ఆప్షన్ ఏ9 గా జగన్ పేరు పెట్టకుండా ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి.  మూడో ఆప్షన్. భార్య భారతీ రెడ్డి గారిని కేసు నుండి తప్పించాడనికి. నాలుగో ఆప్షన్ పైవన్నీ. పిన్ని పసుపు, కుంకుమ చెరిపేసింది ఎవరు? పిన్ని తాళి తెంచింది ఎవరు? చెల్లిపై నిందలు వేసింది ఎవరు? జగన్. బాబాయ్ మర్డర్ ఎవరి రక్త చరిత్ర? జగనాసుర రక్త చరిత్ర.

కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టర్ జగన్
జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. కిలో టమాటో రూ.100, కిలో పచ్చిమిర్చి రూ.100, కిలో చిక్కుడు రూ.100.

దమ్ముంటే ఆ బిల్లులపై స్టిక్కర్ వేయండి
 జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను.  అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్.  100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు.

మహిళలను ఆదుకునేందుకే మహాశక్తి!
జగన్ మహిళల్ని నమ్మించి మోసం చేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు.  2వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.

యువత భవితను దెబ్బకొట్టాడు!
జగన్ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్ కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు.  యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.  నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం.  అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

రైతులను ఆదుకోవడానికే అన్నదాత పథకం
జగన్  రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్  పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2.  రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.

పోలీసుల డబ్బునూ కొట్టేశాడు!
జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు.  పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది.

బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం!
బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. సైకోపాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం.  15 ఏళ్ల పిల్లాడిని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే సీఎం స్పందించలేదు. అమర్నాధ్ గౌడ్ చేసిన తప్పేంటి? తన అక్కని వేధిస్తున్న వైసిపి కార్యకర్త వెంకటేశ్వర రెడ్డిని అడ్డుకున్నాడు. బీసీలు అంటే జగన్ కి చిన్నచూపు. అమర్నాధ్ గౌడ్ బీసీ కాబట్టే జగన్ కుటుంబాన్ని పరామర్శించాడనికి కూడా వెళ్లలేదు. టిడిపి అమర్నాథ్ కుటుంబాన్ని ఆదుకుంది. మేం వచ్చాక అమర్నాధ్ గౌడ్ ని చంపిన వారిని కఠినంగా శిక్షిస్తాం.

వారి వేధింపులవల్లే దళిత సిఐ ఆత్మహత్య
డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. తాడిపత్రి లో వైసిపి నేతల ఒత్తిడి తట్టుకోలేక దళిత సిఐ ఆనందరావు గారు ఆత్మహత్య చేసుకున్నారు. టిడిపి నేత జేసి ప్రభాకర్ రెడ్డి, కార్యకర్తల పై కేసులు పెట్టాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడి చెయ్యడంతోనే ఆనందరావు గారు ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయారు. ఒక పోలీసు ఆత్మహత్య చేసుకుంటే మిగిలిన వాళ్లు, సంఘాలు స్పందించలేదు.జగన్ ఆ కుటుంబానికి అన్యాయం చేసాడు. ఆనందరావు కుటుంబాన్ని టిడిపి ఆదుకుంటుంది. ఆనందరావు ఆత్మహత్యకు కారణం అయిన వారిని టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శిక్షిస్తాం.

మైనారిటీలకు తప్పని చిత్రహింసలు
జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు జిల్లా ప్రజలు 2019లో టిడిపి గౌరవాన్ని నిలబెట్టారు. 4 సీట్లు గెలిపించారు. 2024 లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లా ని గుండెల్లో పెట్టుకొని అభివృద్ధి చేస్తాం. 2019 లో వైసిపి 8 సీట్లు గెలిచింది. టిడిపి ఎమ్మెల్యే ని కూడా పార్టీలో చేర్చుకున్నారు. మొత్తం 9 ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే జిల్లా ఎలా అభివృద్ధి చెందాలి? అభివృద్ధి లో దూసుకెళ్ళాలి. నంబర్ 1 గా ఉండాలి. కానీ జరిగిందేమిటి?

ప్రకాశం జిల్లాకు జగన్ పీకిందేమిటి?
ఉమ్మడి ప్రకాశం జిల్లా కి జగన్ పీకింది ఏంటి? వెలిగొండ ప్రాజెక్ట్ పనులు ఏడాదిలో పూర్తి చేస్తా అన్నాడు. పూర్తి చేసాడా ? 6 సార్లు తేదీలు మార్చాడు. నడికుడి – కాళహస్తి పనులు రైల్వే పనులు పూర్తి అయ్యాయా? నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కోసం టిడిపి హయాంలో భూసేకరణ చేసాం. ఆ ప్రాజెక్ట్ జగన్ పాలనలో ఎత్తిపోయింది. రాయల్టీ, కరెంట్ ఛార్జీలు, పన్నులు పెంచి గ్రానైట్ పరిశ్రమను దెబ్బతీసాడు.  దొనకొండ వద్ద ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చెయ్యాలని టిడిపి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ ప్రాజెక్టు ని అటక ఎక్కించింది జగన్ ప్రభుత్వం.  గుండ్లకమ్మ ప్రాజెక్టును నాశనం చేసాడు. గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు లోని నీరు మొత్తం ఖాళీ చేసారు. జగన్ అసమర్ధత కారణంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రమాదంలో పడింది.

కందుకూరుని అభివృద్ధి చేసింది టిడిపి!
కందుకూరు ని అభివృద్ధి చేసింది టిడిపి. సాగు,తాగు నీటి ప్రాజెక్టులు, రోడ్లు, వంతెనలు , టిడ్కో ఇళ్లు నిర్మించింది టిడిపి. టిడ్కో ఇళ్లు మొదటి దశ లో 1408 ఇళ్లు 90 శాతం పూర్తి అయ్యాయి. మిగిలిన 10 శాతం పూర్తి చేసి లబ్దిదారులకు ఇవ్వలేదు ఈ వైసిపి ప్రభుత్వం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు అందిస్తాం. కందుకూరు టౌన్ లో రోడ్లు, పార్కులు ఏర్పాటు చేసాం. ఆ పనులు కూడా ఆపేసింది ఈ వైసిపి ప్రభుత్వం. 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో రామాయపట్నం నిర్మాణానికి శంకుస్థాపన చేసాం. మైనర్ పోర్టుల నిర్మాణం కూడా ప్రారంభించాం. 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఏషియన్‌ పల్ప్‌ అండ్‌ పేపర్‌ పరిశ్రమను తీసుకొస్తే జగన్ తన్ని తరిమేసాడు. అది వచ్చి ఉంటే ఇక్కడ సుబాబుల్, జామాయిల్ రైతులకు ఎంతో మేలు జరిగేది. రాళ్లపాడు రిజర్వాయర్ ని అభివృద్ధి చేసింది టిడిపి. ఎడమ కాలువ పనుల కోసం 38 కోట్లు మంజూరు చేసాం.

జగన్ ఇచ్చిన హమీలు ఏమయ్యాయి?
మీరు పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. కందుకూరు ని అభివృద్ధి లో పరుగులు పెట్టిస్తారని మీరు వైసిపిని గెలిపించారు. కందుకూరు లో అభివృద్ది అడ్రస్ లేకుండా పోయింది. కందుకూరుకి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. రాళ్లపాడు ప్రాజెక్టు ఎడమ కాలువ అభివృద్ధి చేస్తామని చెప్పి  చెయ్యలేదు.  కందుకూరుకు బైపాస్ నిర్మాణం చేస్తామని చెప్పి  చెయ్యలేదు. ఉలవపాడు మామిడి రైతులకి అనేక హామీలు ఇచ్చాడు. ఒక్కటీ నిలబెట్టుకోలేదు. ఇచ్చిన హామీలు ఎందుకు నిలబెట్టుకోలేదు అని ఎమ్మెల్యే గారు కనీసం ప్రశ్నించలేదు.

కందుకూరును ప్రకాశం జిల్లాలో కలుపుతాం
కందుకూరు లో పసుపు జెండా ఎగిరి 25 ఏళ్లు అయ్యింది. కందుకూరు లో టిడిపి ని గెలిపించండి.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కందుకూరు ని ప్రకాశం జిల్లాలో కలుపుతాం. పొగాకు, మినుము, మిర్చి, శెనగ పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనీసం వైసిపి ప్రభుత్వంలో నష్టం అంచనా వేసే దిక్కు కూడా లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల్ని ఆదుకుంటాం. రామాయపట్నం పోర్ట్ పూర్తి చేస్తాం. పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.  పేపర్ మిల్ పరిశ్రమ ఏర్పాటు చేసి సుబాబుల్, జామాయిల్ రైతులను ఆదుకుంటాం. రాళ్ళపాడు ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం. పిల్ల కాలువలు ఏర్పాటు చేసి రెండు పంటలు పండేలా చర్యలు తీసుకుంటాం.

మోడల్ టౌన్ గా అభివృద్ధి చేస్తాం!
కందుకూరు టౌన్ ని మోడల్ టౌన్ గా తీర్చిదిద్దుతాం. మామిడి, సపోటా రైతులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. మార్కెటింగ్ అవకాశంతో పాటు  గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తాం. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తాం. మైనార్టీలకు అవసరమైన షాదీఖానా, ఖబరస్తాన్‌ ఏర్పాటు కోసం గతంలోనే చర్యలు తీసుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి ఆ పనులు ఆపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులు పూర్తి చేస్తాం.  టిడిపి నాయకులు, కార్యకర్తల పై కేసులు పెట్టి వేధించిన ఎవ్వరినీ వదిలి పెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తా. కష్ట కాలంలో జెండా మోసిన కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకుంటా.

నారా లోకేష్ ను కలిసిన రామచంద్రపురం గ్రామప్రజలు

కందుకూరు నియోజకవర్గం రామచంద్రపురం గ్రామప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.మా గ్రామంలో ఎంపియుపి స్కూలుకు కాంపౌండ్ వాల్ లేదు. స్కూలు పిల్లలకు తాగడానికి మంచినీరు లేదు.మా గ్రామం నుండి చుండి మోడల్ స్కూలుకి అంకభూపాలపురం మీదుగా రోడ్డువేయాలి.మా గ్రామంలో చెరువుకట్ట పూర్తిగా దెబ్బతింది.మా ఊరికి శ్మశానం లేక ఇబ్బందుపడుతున్నాం.

నారా లోకేష్ మాట్లాడుతూ… గత నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు.నాడు-నేడు పేరుతో వేలకోట్ల దోచుకున్న జగన్ అండ్ కో స్కూలు భవనాలకు ప్రహరీగోడలు, మంచినీటి సౌకర్యం కల్పించకపోవడం దారుణం.పాఠశాలల్లో చాక్ పీస్ లు, డస్టర్లు కూడా కొనుగోలు చేయలేని దుస్థితి కల్పించారు. నీతిఆయోగ్ వెల్లడించిన నివేదిక ప్రకారం ఎపి పాఠశాల విద్యలో 19వస్థానానికి దిగజారింది.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే టీచర్ పోస్టులు భర్తీచేయడమేగాక స్కూళ్లలో సకల సదుపాయాలు కల్పిస్తాం.రామచంద్రపురం చెరువుకట్టను పటిష్టం చేస్తాం, శ్మశానికి స్థలం కేటాయిస్తాం, లింకు రోడ్ల నిర్మాణం చేపడతాం.

నారా లోకేష్ ను కలిసిన అంకభూపాలపురం గ్రామస్తులు

కందుకూరు నియోజకవర్గం అంకభూపాలపురం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.మా గ్రామంలో ఎస్టీ కాలనీకి నీళ్లు లేక యానాదులు ఇబ్బంది పడుతున్నారు.గ్రామంలో సిసి రోడ్లు, శ్మశాన వాటిక లేవు.మా గ్రామం నుంచి చుండి మండల స్కూలుకు 150మంది పిల్లలు వెళ్తున్నారు.మా గ్రామం నుంచి చుండి వెళ్లే 3 కి.మీ.ల రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది.గ్రామంలో డ్రైనేజీలు లేక వర్షపునీరు రోడ్లపైకి చేరుతోంది.గ్రామంలోని కొత్తచెరువు ఆక్రమణలకు గురైంది.మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామసీమలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి.గ్రామపంచాయితీలకు చెందిన 9వేల కోట్ల నిధులను జగన్ ప్రభుత్వం దొంగిలించింది.గత టిడిపి హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ.ల సిసి రోడ్లు వేయగా, ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్లపై తట్టమట్టిపోసే దిక్కులేదు.టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికీ కుళాయి అందజేసి, 24/7 తాగునీరు అందిస్తాం.రోడ్లు, డ్రైనేజీలు, శ్మశానవాటికలు ఇతర మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం.

LEAVE A RESPONSE