– భారతిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఆగమేఘాలపై అరెస్టులు చేస్తున్న పోలీసులు
– ఇతర మహిళలను అత్యంత నీచింగా దూషిస్తూ పోస్టులు పెడుతున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?
– మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఏం సమాధానం చెప్తారు?
– జగన్ రెడ్డి అండతోనే రెచ్చిపోతున్న కిరాయి మూకలు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
జగన్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్య హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛ వినియోగించుకునే అవకాశం లేకుండాపోయింది. వైసీపీ ప్రభుత్వ వైపల్యాలను ప్రశ్నిస్తున్న టీడీపీ మహిళా నేతలపై సామాజిక మాధ్యమాల్లో నీచంగా పోస్టులు పెడుతున్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో మహిళలకు కనీస భద్రత లేకపోవడంపై ప్రశ్నించిన టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపై సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం చేయడం జగన్ రెడ్డి దిగజారుడు రాజకీయానికి పరాకాష్ట.
వైసీపీ ఆవిర్బావం తర్వాత రాజకీయాల్లో నైతిక విలువలు పతనమయ్యాయి. మహిళలను కించపర్చేలా పోస్టులు పెట్టమని మీ రాజారెడ్డి రాజ్యాంగంలో రాసుందా? ఒక వ్యక్తి గురించి తప్పుగా ప్రచారం చేస్తే వాళ్లు ఎంత బాధపడతాయో జగన్ రెడ్డికి ఏం తెలుసు? ప్రతిపక్ష పార్టీల్లోని మహిళలను మార్ఫింగ్ చిత్రాలతో అత్యంత అసభ్యకరంగా చిత్రీకరిస్తూ పోస్టులు పెడుతున్నా వారి జోలికి పోలీసులు వెళ్లకపోవడం దేనికి సంకేతం?
సీఎం జగన్ భార్య భారతిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఆగమేఘాలపై అరెస్టులు చేస్తున్న పోలీసులు…ఇతర మహిళలను అత్యంత నీచింగా దూషిస్తూ పోస్టులు పెడుతున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఏం సమాధానం చెప్తారు? మహిళలకు ప్రభుత్వమే రక్షణ కల్పించకపోతే ఇంకెవరి దగ్గరకు వెళ్లాలి? ఇకనైనా ఇలాంటి దిగజారుడు చర్యలు మానుకోండి. లేకపోతే మహిళా లోకం మీకు తగిన బుద్ధి చెప్పడం ఖాయం.