– క్షేత్రస్థాయి వైసీపీకార్యకర్త నుంచి ముఖ్యమంత్రివరకు అందరూ కలిసి రైతులసొమ్ముని విచ్చలవిడిగా దోచుకుంటున్నారు
– ఏపీ పోలీస్ వ్యవస్థ వైసీపీనేతలు, కార్యకర్తల దుర్మార్గాలు, అక్రమాలకు కంచెలా కాపలాకాస్తోంది.
• సహాకారరంగంలోని దోపిడీపై దర్యాప్తు జరిపించాలని కేంద్రసహకారమంత్రి అమిత్ షాకు ఫిర్యాదుచేశాం.
• రాష్ట్రంలో అంతాబాగుందని డీజీపీచెప్పడం ఎంతమాత్రం సరైందికాదు
– డీజీపీ అంతాబాగుందని అనుకుంటే అంత కంటే మూర్ఖత్వం మరోటిలేదు
– సత్తెనపల్లి డీఎస్పీపై ఫిర్యాదు చేస్తా
• ప్రభుత్వ, పాలకుల అవినీతి, అక్రమాలు, దోపిడీకి కాపలాకాయడమే పోలీసులపనిగా మారింది.
– టీడీపీనేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
జగన్మోహన్ రెడ్డిపాలనలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని, ప్రభుత్వ, పాలకులు అక్రమాలు, అరాచకాలు, అవినీతి, దోపిడీకి కాపలాకాయడమే పోలీసుల పనిగా మారిందని, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలరక్షణ అనేవి పోలీస్ విభాగానికి అసలు పట్టడంలేదని టీడీపీనేత, మాజీ మంత్రి కన్నాలక్ష్మీనారాయణ తెలిపారు.
మంగళగిరిలోని పార్టీజాతీయకార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే మీకోసం…!
అవినీతినిప్రశ్నించినవారిపై అక్రమకేసులు పెడుతూ, వైసీపీనేతలు, కార్యకర్తల రక్షణే తమవిధినిర్వహణ అన్నట్టుగా రాష్ట్రపోలీస్ శాఖ వారికి కంచెలా కాపలాకాస్తోంది.
“ వైసీపీనేతలు, కార్యకర్తలే రక్షణే తమవిధినిర్వహణ అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ అధికారపార్టీకి కంచలా కాపలాకాస్తోంది. ప్రభుత్వ, పాలకులఅక్రమాలు అవినీతిని ప్రశ్నించినవారిపై అక్రమకేసులు పెట్టి అకారణంగా అరెస్ట్ చేయడం పోలీస్ వ్యవస్థకు సిగ్గుచేటు. విశాఖపట్నంలో సాక్షాత్తూ అధికారపార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయ డం రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ పనితీరుకి నిదర్శనం. సొంతపార్టీ ఎంపీకుటుంబాన్ని కా పాడలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా?
ముఖ్యమంత్రే అక్రమాలు, దోపిడీలు పెంచిపోషిస్తూ, మాఫియాడాన్ ల తయారవ్వడం నిజంగా దురదృష్టకరం. బాపట్లజిల్లా చెరుకుపల్లిలో తనసోదిరిని ఏడిపించినవారిని ప్రశ్నించినందుకు పదోతరగ తి విద్యార్థిని పెట్రోల్ పోసి తగలబెట్టడం ఈ ప్రభుత్వదుర్మార్గానికి నిదర్శనంకాదా? మహిళలపై జరిగే అత్యాచారాలు, ఇతరదారుణాల్ని నిరోధించాల్సిన రాష్ట్రహోంమంత్రే బాధ్యతలేకుండా మాట్లాడుతున్నారు. ఎక్కడో ఒకటీఅరా జరగుతున్నాయని జరిగే దారుణాల్ని ఆమె తక్కువచేసి మాట్లాడటం ఎంతమాత్రం సరైందికాదు.
గతంలో నేను విశాఖపట్నం ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు నగరంలోకి సంఘవిద్రోహశక్తులు ప్రవే శించాయని తెలియగానే, పోలీస్ శాఖను అప్రమత్తంచేసి, ఇద్దరు క్రిమినల్స్ ను ఎన్ కౌం టర్ చేయించాము. రాష్ట్ర ప్రభుత్వంలోని వారే దోచుకోగాలేనిది, తాముదోచుకుంటే తప్పే మిటన్న ధీమాతోనే రాష్ట్రవ్యాప్తంగా సంఘవిద్రోహశక్తులు పేట్రేగిపోతున్నాయి.
ఒక వైసీపీ ఎమ్మెల్యే, ఒకపాత్రికేయుడితో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి ని చేయడంకోసం తాము పెట్టుబడి పెట్టామని, ఆయన దోచుకుంటుంటే తాముచూస్తూ ఎలాకూర్చుంటామని అన్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యే మాటల్ని బట్టే రాష్ట్రంలోజరిగే దోపిడీ ఏస్థాయిలో ఉందోఅర్థంచేసుకోవచ్చు. డీజీపీ అంతాబాగుందని అనుకుంటే అంత కంటే మూర్ఖత్వం మరోటిలేదు. సత్తైనపల్లి డీఎస్పీపై ఫిర్యాదుచేయడానికి తానేడీజీపీని కలుద్దామనుకుంటున్నాను. ప్రతిపక్షనేతగా తాముఎప్పుడు ఫోన్ చేసినా, సదరు డీ ఎస్పీ స్పందించడు.
రాష్ట్రసహకారరంగాన్ని వైసీపీప్రభుత్వం దోపిడీకి అడ్డాగామార్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కిందిస్థాయి వైసీపీనేతనుంచి ముఖ్యమంత్రివరకు సహకారరంగంలో రూ.5వేలకోట్లు కాజేశారు. దీనిపై దర్యాప్తుజరిపించాలని ఇప్పటికే కేంద్రహోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదుచేయడం జరిగింది.
రాష్ట్ర సహకార రంగంలో జరిగే అవినీతిపై కేంద్రహోంమంత్రి అమిత్ షాకు, ఈడీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అలానే నాబార్డ్ ఛైర్మన్ కు కూడా ఫిర్యాదుచేశాను. అందరికోసం పనిచేయాల్సిన సహకారవ్యవస్థలో జవాబుదారీతనం లేకుండాచేసి, జేబుదొంగలకు అప్పగించారు. ఇసుకదందాలో ఎలాగైతే పాలెగాళ్లను నియమించి దోచుకుంటున్నారో, అలానే త్రిసభ్యకమిటీలను నియమించి సహకారసంఘాల్లోని సొమ్ముని అధికార పార్టీనేతలు విచ్చలవిడిగా దోచేస్తున్నారు.
నాబార్డ్, కేంద్రప్రభుత్వం, ఎన్.సీ.డీ.సీ లు రైతులకోసంఇచ్చే సొమ్ము మొత్తం రాష్ట్రంలో పక్కదారి పడుతోంది. కొన్నిజిల్లాల్లో జరిగే దోపిడీపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాన్ని, పాలకుల్నిప్రశ్నించడం జరిగింది. సహకార రంగంలో వందలకోట్ల అవినీతిజరుగుతున్నా పట్టించుకునేనాథుడే లేకుండా పోయాడు. కిందిస్థాయి వైసీపీనేతలనుంచి అధికారులు, ముఖ్యమంత్రికి వాటాలు వెళ్తు న్నందునే సహకారరంగంలో దోపిడీ ఎక్కువైంది.
ఏలూరు జిల్లా టీ.నరసాపురం, చింతల పూడి, కామవరపుకోట, రంగాపురం, సరిపల్లితోపాటు, పలుసొసైటీల్లో దగ్గరదగ్గర రూ. 400కోట్ల అవినీతిజరిగింది. ఏలూరుసెంట్రల్ బ్యాంక్ లో రూ.17కోట్లు అన్యాక్రాంతం అయ్యాయి. ఏలూరుజిల్లా చింతలపూడి సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, 15సెంట్ల స్థలంతనఖాపెట్టి, 1.5కోట్ల రుణంతీసుకున్నాడు.
ఇటీవల గుంటూరు సెంట్రల్ బ్యాంక్ లో డ్వాక్రామహిళలపేర్లుమార్చి రూ.500కోట్లవరకు కాజేసిన వ్యవహారం బయటపడిం ది. ముఖ్యమంత్రి సొంతజిల్లాలో విపరీతమైన అవినీతిజరిగింది. కృష్ణాజిల్లాపెడనలో ఒక మహిళ పేరుతోఉన్న 1.80ఎకరాలభూమిని తనఖాపెట్టి, ఆమెకే తెలియకుండారుణం తీసుకున్నారు.
విశాఖపట్నం సెంట్రల్ బ్యాంక్ లో కోటిరూపాయాలు, వినుకొండలో రూ.2కోట్లు, తూర్పుగోదావరిజిల్లా గండేపల్లిసహాకారసంఘంలో రూ.23కోట్లు, కాకినాడ జయలక్ష్మిసహకారబ్యాంకులో రూ.560కోట్లు కాజేశారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీనేతలు కొట్టేసినమొత్తం రూ.5వేలకోట్లకుపైనే ఉండొచ్చు.
రైతులసంక్షేమానికి వినియోగించాల్సిన సొమ్ముని తమసంక్షేమంకోసం వినియోగించుకున్న వైసీపీదొంగల ఆటకట్టించాల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా సహకారసంఘాల్లో జరిగినదోపిడీపై కేంద్ర సహాకార శాఖమంత్రికి, ఈడీకి, నాబార్డ్ ఛైర్మన్ కు టీడీపీతరుపున తాము ఫిర్యాదుచేయడం జరిగింది.
రాష్ట్రంలోని సహకారసంఘాలకు వచ్చేవేలకోట్ల లావాదేవీలపై ప్రభుత్వం తక్షణమే శ్వేత పత్రం విడుదలచేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఏరైతుకి ఎంతరుణమిచ్చారు..వారుతిరిగి ఎంత చెల్లించారనే వివరాల్ని ప్రభుత్వం తక్షణమే ప్రజలముందు ఉంచాలి.
సహకారసంఘాల్లో అక్రమాలకు పాల్పడిన అధికారుల్ని సస్పెండ్ చేసి, విచారణ జరిపించి, తప్పుచేసిన వారిని జైళ్లకు పంపాలని, రాష్ట్రంలోని సహకారసంఘాలకు వచ్చినవేలకోట్లసొమ్ముకి సంబంధించిన లావాదేవీలపై శ్వేతపత్రంవిడుదలచేయాలని, కేంద్రస్థాయిలో శాఖాపరమైన దర్యాప్తుజరిపించాలని, రాష్ట్రవ్యాప్తంగా ఏరైతుకి ఎంత రుణంఇచ్చారు, వారుఎంతచెల్లించారనే వివరాల్ని ప్రతిసహాకారసంఘం ప్రజలముందు ఉంచాలని డిమాండ్ చేస్తున్నాం.
అలానే ఏళ్లతరబడి సహకారసంఘాల్లో తిష్టవేసిన అధికారుల్ని తక్షణమేబదిలీచేయాలని కోరుతున్నాం. మా ఈ డిమాండ్లను కేంద్రసహా కారశాఖమంత్రి అమిత్ షాదృష్టికి తీసుకెళ్లాము. తాములేవనెత్తిన డిమాండ్లపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్పందించకుంటే, రైతులతోకలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం.
సహకారసంఘాల్లో రైతులుఎన్నుకున్న సభ్యులు, కమిటీలుఉండాలి. కానీ ప్రభుత్వం ఎంపికచేసిన సభ్యులు, కమిటీలు ఉండటంవల్ల సహకారసంఘాలసొమ్ము పక్కదారి పడుతోంది. రైతులుకూడా వారిభూములు సురక్షితంగా ఉన్నాయోలేదో ఎప్పటికప్పు డు పరిశీలించుకోవాలి. గతంలో తాముమంత్రులుగా పనిచేశాము. ఆనాడు పత్రికల్లో ఏవైనా కథనాలువచ్చినా, ఎవరైనా ఫిర్యాదుచేసినా వెంటనేస్పందించి చర్యలుతీసుకు నేవాళ్లం.
కానీ ఈ ప్రభుత్వంలో ఏంజరిగినా, ఎవరుదోచుకుంటున్నా పాలకుల్లోచలనం లేదు. రాష్ట్రసహకారరంగాన్ని ఒకగాడిలోపెట్టి, దాన్నిపూర్తిగా పునర్నిర్మించి, పున రుద్ధరించింది నేనేనని గర్వంగా చెప్పుకుంటాను. రాజశేఖర్ రెడ్డిహయాంలో సహకార రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి, సంస్కరించాము. తాముచేసిన సేవల్నిగుర్తించిన అప్పటి నాబార్డ్ ఛైర్మన్ నా ఫోటోని, రాజశేఖర్ రెడ్డి ఫోటోని తనగదిలో పెట్టుకున్నారు.
సహకారరంగంలో రాష్ట్రంలోజరిగే దోపిడీకి సంబంధించి నాదృష్టికి వచ్చిన సమాచారం చాలా తక్కువే. కొన్నిపత్రికల్లో కూడా వచ్చాయి. కానీ ఈ ప్రభుత్వం ఎక్కడాదేనిపై స్పం దించి, చర్యలుతీసుకున్నదిలేదు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా సహకారసంఘాల్లో జరిగే దోపిడీపై దర్యాప్తు జరిపించాలని కేంద్రమంత్రి అమిత్ షాకు లేఖరాయడం జరిగింది.” అని కన్నా తెలిపారు.