ప్రేమ పాత్రుడు

అంతులేని వరమై….
నిన్ను అల్లుకోవాలని
గుండె తలుపు మీటుతూ
తలపు చేసే తొందర…. !!

సంధ్యారాగమై….
నిన్ను లాలించాలని
అధరాల అంచులను తాకుతూ…
పిలుపు చేసే తొందర…. !!

ప్రణయ కావ్యమై….
నిన్ను మైమరిపించాలని
కనుల గడప దాటుతూ
వలపు చేసే తొందర…..!!

నాలోని ప్రేమ
విరులై పూయగా…..
నాలోని అనురాగం
సిరులై కురియగా….

కలల లోకంలో విహరిస్తూ….
నా గుండె గదిలో
అమర దీపంగా….

సదా నా ధ్యాసలో తరిస్తూ….
ఈ దేవేరి సేవలో
ప్రేమ పూజారిగా….
నాలోనే ఉండిపో…!!

ఎప్పటికీ …
నను విడిచి వెళ్ళక
నాతోనే ఉండిపో
“ప్రేమ పాత్రుడిగా”…..!!

– నలిగల రాధికా రత్న

Leave a Reply