-కోదండరాం రెడ్డి ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు?
-బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు అనేక సభల్లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల నోటిఫికేషన్లు ఇస్తారు అని చూశారు.ఆయన మాటలు నమ్మారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చాలా మంది ఎదురు చూశారు. రేవంత్ రెడ్డి మాట మీద నిలబడతాడు…నోటిఫికేషన్లు వేస్తాడు అని నిరుద్యోగులు ఆశ పడ్డారు.
రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువత నమ్మించి మోసం చేశాడు.కానీ ఆయన నిరుద్యోగుల విషయంలో విజయం సాధించారు. మంత్రివర్గ సమావేశాలు పెట్టుకున్నారు కానీ ఒక్క సమావేశంలో కూడా జాబ్ క్యాలెండర్ పై నిర్ణయం తీసుకోలేదు. నోటిఫికేషన్ లు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారు.
సుప్రీంకోర్టు లో కేసు ఉంది.దాన్ని పట్టించుకోకుండా పాత నోటిఫికేషన్ రద్దు చేశారు. మళ్ళీ కొత్తగా వాటికి కొన్ని పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ వెనుక కోచింగ్ కేంద్రాల మాఫియా ఉంది.
గ్రూప్ 2 ఎక్సమ్ వెంటనే పెట్టండి.మళ్ళీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయకుండా అదే నోటిఫికేషన్ కంటిన్యూ చేయండి. కొత్త నోటిఫికేషన్ల ద్వారా మళ్ళీ కోచింగ్ కు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది.దీనితో నిరుద్యోగులకు ఆర్ధిక భారం అవుతుంది. బిస్వాల్ కమిటీ అన్నావ్ గా ఆ కమిటీ నివేదిక బయట పెట్టడం లేదు.గతంలో కోదండరాం రెడ్డి జాబ్ క్యాలెండర్ అన్నారు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ లు రద్దు చేసి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి లబ్ది పొందాలని చూస్తున్నారు. పాత నోటిఫికేషన్లు ద్వారా పరిక్షలు నిర్వహించాలి.