– కొండచరియలు విరిగిపడి 48మంది దుర్మరణం!
(వాసు)
పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో మరో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు మాలిలోని ఉన్న ఓ బంగారు గని కుప్పకూలింది. ఈ ఘటనలో 42మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల కోసం అన్వేషణ కొనసాగుతోందని పర్యావరణ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండో ప్రమాదం.
ఆఫ్రికాలో బంగారం ఉత్పత్తి చేసే ప్రధాన దేశాలలో మాలి ఒకటి. ఇక్కడి గనులలో ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతాయి. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గని కూలిపోవడంతో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం.
స్థానిక అధికారులు ఈ సంఘటనను ధృవీకరించగా, కెనిబా గోల్డ్ మైనర్స్ అసోసియేషన్ మృతుల సంఖ్య 48గా పేర్కొంది. బాధితుల కోసం అన్వేషణ కొనసాగుతోందని పర్యావరణ సంస్థ అధికారి తెలిపారు.