– ఏర్పాట్లలో నిర్లక్ష్యం చూపొద్దని అధికారులను ఆదేశించిన ఇంచార్జి మంత్రి సవిత
– జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి,ఇంచార్జి మంత్రి సవిత
కడప : ఒంటిమిట్ట కల్యాణోత్సవానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని,ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగ కూడదని ఇంచార్జి మంత్రి సవిత అన్నారు.ముందుగా ఒంటిమిట్ట లోని కోదండ రామ స్వామి దేవాలయంలో మంత్రులు సవిత ,ఆనం నారాయణ రెడ్డి ,రాం ప్రసాద్ రెడ్డి,ఎమ్మెల్సీ లు బీద రవిచంద్ర యాదవ్, రాంభూపాల్ రెడ్డి ,ఎమ్మెల్యేలు పుత్తా చైతన్య రెడ్డి తో కలసి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. అనంతరం ఒంటిమిట్ట లో శ్రీరాములు కళ్యాణ మహోత్సవం జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు.
అనంతరం ఆలయంలో జిల్లా అధికారులతో మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి,ఇంచార్జి మంత్రి సవిత ఏర్పాట్లు పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. ఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణ మహోత్సవం కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని,సీఎం చంద్రబాబునాయుడు సంప్రదాయాలు పాటించే వ్యక్తి అని ప్రతి ఏటా వచ్చి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.
ఏప్రిల్ 11న సీఎం చంద్రబాబు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పింస్తారని తెలిపారు.ఆలయ పరిసరాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని ,తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక కావడం, పలువురు విఐపి లు విచ్చేయనుండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. సీతారాముల కల్యాణానికి లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని,ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
దర్శనం, అన్నప్రసాదాల పంపిణీ వద్ద తోపులాట లేకుండా బ్యారికేడ్లు, కల్యాణానికి వచ్చే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని మంత్రి సవిత అధికారులకు తెలియచేసారు.అధికారులంతా సమన్వయంతో పనిచేయాలిని ఏర్పాటల్లో ఎక్కడా లోపాలు తలెత్తనీయొద్దని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీదర్ చెరుకూరి, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, కడప, తిరుపతి జిల్లాల ఎస్పీలు అశోక్ కుమార్, హర్షవర్ధన్ రాజు, జేసీ అదితి సింగ్, పలు శాఖల అధికారులు, పలువురు కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.