ఆమె గర్జిస్తే నిజామే గడగడ
రజాకార్లలో గడబిడ..
నా మాటే తుపాకీ తూటా
అన్న వీరనారి జీవితమంతా
విప్లవాలలోనే ఆటాపాటా..!
ఏం ఊహించి పెట్టారో
స్వరాజ్యమనే పేరు
మది నిండా
స్వతంత్ర భావాలే..
అన్నేయం జరిగినప్పుడు
అక్కరమం పెరిగినప్పుడు
గర్జిస్తే స్వరాజ్యం..
అంతరించిపోయే అక్రమార్కుల ఇష్టారాజ్యం!
అక్షరం రాక..
జ్ఞానమే ఎరుగక..
బ్రతుకు బరువై
గుండె చెరువై
అలమటించే గిరిపుత్రులకు
పాటలతో చేరువై
వెలుగు బాటలు చూపిన
ఆడ వీరమల్లు…
భూస్వాముల గుండెల్లో సూటిగా గుచ్చుకున్న మల్లు!
అలాంటి ఓ మహిళ
ముసలైనా ముసలమే..
నిర్జీవమైనా ఆశయాలు సజీవమే
అలుపెరుగని
పోరాటయోధురాలు
మల్లు స్వరాజ్యం…
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286