– కమలేశ్ , నీతి ఊర్మిళ మృతి
– 36 మంది మావోల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం
ఛత్తీస్ గఢ్ : మావోయిస్టు పార్టీ చరిత్రలోనే అత్యంత భారీ నష్టం. ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో నిన్న 33 మంది మావోయిస్టులు మృతి చెందగా, ఇవాళ మరో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. దాంతో, మరణించిన మావోయిస్టుల సంఖ్య 36కి పెరిగింది.దంతెవా
డ-నారాయణపూర్ సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మరణించిన మావోయిస్టులంతా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన వారు. ఇప్పటి వరకు 36 మంది మావోల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీ ఎత్తున కూంబింగ్ జరుగుతోంది.
మృతుల్లో మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు, దండకారణ్య రాష్ట్ర కమిటీ సభ్యులు తక్కల్లపల్లి వాసుదేవరావు ఉన్నట్టు భావిస్తున్నారు. ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కమాండర్లు కమలేశ్ అలియాస్ ఆర్కే, నీతి అలియాస్ ఊర్మిళను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. కమలేశ్ ఏపీలోని విజయవాడ ప్రాంతానికి చెందినవారు. ఊర్మిళది బీజాపూర్ జిల్లా గంగలూరు ప్రాంతంగా తెలుస్తోంది.