( పులగం సురేష్ )
ఒకప్పుడు పెళ్ళికాక ముందు
ఒకరినొకరు ప్రేమించుకొనేవారు.
ప్రేమ ఫలిస్తే పెళ్ళి చేసుకొనేవారు.
విఫలం అయితే
ఒక మధుర జ్ఞాపకంగా మోసేవారు.
కానీ ఇప్పుడు పెళ్ళి చేసుకొని
ప్రేమలో పడుతున్నారు.
తప్పేం లేదు అనుకుంటున్నారు కదా?!
కాకపోతే ఒకరితో ఒకరు కాదు..
ఒక్కొక్కరు ఒక్కొక్కరితో!
కర్మేంటంటే.. వాళ్ళ ప్రేమలు
కథలు కథలుగా మనం చెప్పుకోవడం.
ఆ ప్రేమలు 40 ఏళ్ళ వయసులో పుట్టడం.
ఆ వ్యక్తుల భార్య/భర్తలు బ్రతికి ఉండటం.
ఒకరికొకరికి విడాకులు కాకపోవడం.
అలాంటి వాటిని కొందరు సమర్ధించడం.
ఈ కళ్ళతో ఆ దరిద్రాలు మనం చూడటం.
నాకో అనుమానం..
బంధువులు,కుటుంబం,వాళ్ళ పిల్లలు
సమాజంలో ఎలా తిరుగుతున్నారో ఏమో!?
వాళ్ళకు చెప్పాలి అని అనిపించదా!?
లేక చెప్తే వినే రకాలు కాదా!?
ఏమో ఏందో….
ఇక రాబోయే కాలంలో పెళ్ళిళ్ళు ఉండవు
అనుకుంటా..
ఎవరికి ఇష్టమైన వాళ్ళతో వాళ్ళు
సహజీవనం చేయడం.
ఇష్టంలేకపోతే విడిపోవడం.
ఇంకొకరితో మళ్ళీ కొత్తగా సహజీవనం
మొదలెట్టడం.
ఈ మధ్య కొత్తగా వాడుతున్నారుగా
రిలేషన్‌షిప్‌లోఉన్నాము అని!
మొత్తానికి విదేశీ సంస్కృతి
బాగా వంటపడుతుంది మనోళ్ళకి!!
వినాశకాలే విపరీత బుద్ధులు.