– తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్: మార్వాడీలు మన దేశానికి చెందినవారని, వారంతా మనలో ఒకరని, అలాంటి వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మార్వాడీ గో బ్యాక్ అంశంపై వ్యాఖ్యలపై స్పందించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో మాట్లాడారో తెలుసుకుంటామని, ఈ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని తెలిపారు.