Suryaa.co.in

Features

మార్క్సిజమ్.. కమ్యూనిజమ్.. ఒక మానసిక రుగ్మత

– కాల్ మార్క్స్ లాగా అతి ‘అధమమైన బతుకు’ బతికేందుకు సిద్ధపడతారా?
– మార్క్స్ లాగా బతికేందుకు తమ సంతానాన్ని తయారు చేస్తారా?

విదేశీ మతాల తర్వాత మనదేశానికి అతి తీవ్రమైన హాని చేసింది కమ్యూనిజమ్ లేదా మార్క్సిజమ్.
మన దేశ చరిత్ర, చదువు, అభివృద్ది, ప్రశాంతత, పౌరుల జీవనం, మన తలితండ్రుల ఆశలు, నమ్మకాలు, కుటుంబాలు, మానవ సంబంధాలు వీటిని భయంకరంగా దెబ్బకొట్టింది కమ్యూనిజమ్ లేదా మార్క్సిజమ్. మార్క్స్.. కాల్ మార్క్స్.. గురించి అంతర్జాతీయ అధ్యయనం ఇలా తెలియజేస్తోంది:
కాల్ మార్క్స్ గురించి తెలియజేస్తూ CHAMBERS BIOGRAPHYICAL DICTIONARY ఇలా రాసింది:
“చాల వరకు అతడి (మార్క్స్) నిర్దిష్టమైన సూచనలు, సిద్ధాంతాలు చారిత్రికంగా తప్పైపోయాయి. (falsified అని మూలం… అంటే అబద్ధం అయిపోయాయనీ, బూటకమైనవైపోయాయనీ,మోసపూరితమైనవైపోయాయనీ కూడా పరిగణించచ్చు) అటుపై మార్క్సిజమ్, ఆచరణలో పదేపదే అసహ్యకరమైన సామాజిక, రాజకీయ చిక్కులకు దారి చూపించింది…”

ఇలా చారిత్రిక వాస్తవాన్ని చెప్పాక

“మార్క్సిజమ్ ను అంటిపెట్టుకునున్న సెక్యులర్స్ ఏ మత, రాజకీయ తెగలవాళ్లకన్నా ఎక్కువ మందే ఉన్నారు” అనీ చెబుతోంది.

(Many of his predictions and doctrines have been falsified by history, and ‘Marxism’ has been shown in practice often to have abhorrent social and political implications; but his general theories still exert an enormous influence on social science, and the secular adherents of ‘Marxism’ continue to outnumber the followers of almost any other religious or political ceed)

ఇదిగో ఈ స్థితి మన దేశానికి, ప్రపంచానికి పెనుహానికరం ఐంది; ఔతోంది; ఔతుంది.
కాల్ మార్క్స్ వైపుకు ఒకసారి చూస్తే మనకు అతడి గుఱించి ఏం తెలుస్తుంది?
ఈ మార్క్స్ జీవన స్థాయి ఏమిటి?
ఈ మార్క్స్ ఎంత మందికి జీవనోపాధి కల్పించాడు?
ఈ మార్క్స్ సంఘానికి, సాటి మనిషికి చేసిన సహాయాలున్నాయా?
ఈ మార్క్స్ ధార్మిక‌ కార్యక్రమాలు చేశాడా?
ఈ మార్క్స్ అవసరమైన వాళ్లకు వైద్య సదుపాయాలు కల్పించాడా?
ఈ మార్క్స్ ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించి ఉంటాడు?
ఈ మార్క్స్ ఆకలి దప్పులు తీర్చగలిగే పనులేమైనా చేశాడా?
ఈ మార్క్స్ ఏం‌ పనిచేసేవాడు?
ఈ‌ మార్క్స్ సిరి‌సందలతో బతికే వాడా?
ఈ మార్క్స్ ఏ మాత్రం సాహితీవేత్త?
ఈ మార్క్స్ ఏమైనా కళాకారుడా?
ఈ మార్క్స్ వృత్తి ఏమిటి?

ఈ మార్క్స్ కనీసం తన కుటుంబానికైనా మేలు చేశాడా?
ఈ మార్క్స్ చారిత్రిక పరిశోధకుడా?
ఈ మార్క్స్ ఏ విద్యా సంస్థనైనా నిర్వహించాడా?
ఈ మార్క్స్ ఎందుకు అప్పులు ఎగ్గొట్టేవాడు?

ఈ మార్క్స్ తన డబ్బుతో, తన ప్రవర్తనతో, తన బుద్ధితో, తన ప్రయత్నంతో ఏ రంగంలోనైనా, ఏ రూపంలోనైనా, ఏ మనిషికైనా ఏ మాత్రమైనా ఉపయోగపడ్డాడా?
ఈ మార్క్స్ వల్ల ఏ అభివృద్ధి జరిగింది?
ఈ మార్క్స్ నిర్మాణాత్మకంగా ఏం చేశాడు?
ఇలాంటి ప్రశ్నలకు తిన్ననైన, సరైన, జవాబులు అందుబాటులోకి వస్తే మనకు, మన తోటివాళ్లకు, మన సమాజానికి హాని తప్పిపోతుంది.
కాల్ మార్క్స్ పుట్టిన రోజున మార్క్సిజమ్, కమ్యూనిజమ్ వల్ల మన దేశంలో జరిగిన దాడులు, హత్యలు, పేల్పుళ్లు, కాల్పులు, విధ్వంసం, వినాశనం, అడవులపాలైన వాళ్ల కన్నతల్లుల కడుపు కోతలు, పులి చంపిన లేడి నెత్తురు, దోపిడీలు వీటిని చరిత్ర గుర్తు చేస్తోంది.

మార్క్సిజమ్ లేదా కమ్మూనిజమ్ వల్ల మన తెలుగునేల దారుణంగా గాయపడింది. ముఖ్యంగా తెలుగు కవిత్వం కమ్యూనిజమ్ వల్ల అతి తీవ్రంగా భ్రష్టుపట్టింది. ‘కమ్యూనిజమ్ వల్ల తెలుగు కవిత్వం దెబ్బతిన్నంతగా ప్రపంచంలోని ఏ భాష కవిత్వమూ దెబ్బతినలేదు’. వచ్చిన రోగం ఏమిటో కూడా తెలుసుకోలేని స్థితిలో, రోగం వచ్చిందని అని కూడా తెలుసుకోలేని స్థితిలో, ఇవాళ తెలుగు కవిత్వం ఉచ్చల కవిత్వం అయిపోయి సమాజం చేత అసహ్యించుకోబడుతోంది.

కాల్ మార్క్స్ & కమ్యూనిజమ్… ఏ వెలుగులకీ ప్రస్థానం?

మనదేశంలో కమ్యూనిజమ్ సగటు మనిషికి పనికిరానిది కాకపోవడం కాదు హానికరమైందై దారుణంగా విఫలమైంది. ‘మార్క్సిజమ్ లేదా కమ్యూనిజమ్ ఒక మానసిక రుగ్మత’ అని అంతర్జాతీయ అధ్యయనాలు విశ్వవ్యాప్తంగా తెలియజేస్తున్నాయి.
ఈ క్షేత్ర వాస్తవం తెలియజెప్పే పాఠాన్ని మానసిక రోగానికి అతీతంగా
మనం మామూలు మనుషులంగా చదవాలి.
ఇంకా కమ్యూనిజమ్, మార్క్సిజమ్, కాల్ మార్క్స్ అంటూ అరుస్తున్నవాళ్లూ, ఆగం చేస్తున్నవాళ్లూ కాల్ మార్క్స్ లాగా అతి ‘అధమమైన బతుకు’ బతికేందుకు సిద్ధపడతారా? మార్క్స్ లాగా బతికేందుకు తమ సంతానాన్ని తయారు చేస్తారా?

– రోచిష్మాన్
9444012279

LEAVE A RESPONSE