Suryaa.co.in

Andhra Pradesh

అంగరంగ వైభవంగా ప్రారంభమైన మసూల బీచ్ ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమాలు

మచిలీపట్నం: శనివారం సాయంత్రం ఆహ్లాదకరమైన మంగినపూడి బీచ్ ఒడ్డున మసులా బీచ్ ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

మచిలీపట్నం కు చెందిన ప్రముఖ డైరెక్టర్ మారుతి వచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి కొల్లు ర‌వీంద్ర ఎంతో కృషి చేస్తున్నార‌న్నారు. ఈ ప్రాంతం వాడిగా పుట్టినందుకు గ‌ర్విస్తున్నాన‌న్నారు. కష్టపడితే మనిషి సాధించలేనిది ఏమి లేదని, అందుకు నా జీవితమే ఒక ఉదాహరణ అని అన్నారు. 400 కోట్ల రూపాయల వ్యయంతో పాన్ ఇండియా సినిమా తీయడం చాలా సంతోషంగా ఉందన్నారు.. బీచ్ ఫెస్టివల్ కు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

సినిమా ఇండస్ట్రీలో బందర్ పరిసర ప్రాంతాలకు చెందిన వాళ్లు అనేక మంది ఉన్నారని, ఎక్కడికి వెళ్ళినా వాళ్లు నన్ను పలకరిస్తునే ఉంటారనన్నారు. హీరో ప్రభాస్ తో గత రెండు సంవత్సరాలుగా రాజా సాబ్ సినిమా కోసం పని చేస్తున్నానన్నారు. ఫ్యాన్స్ ఊహించిన దాని కంటే ఒక శాతం ఎక్కువగానే సినిమా ఉంటుందని స్పష్టం చేసారు. జూన్ 16 న టీజర్ ను లాంచనంగా ఆవిష్కరిస్తున్నామనన్నారు. ప్రభాస్ రాజులకే రాజు అని తెలిపారు..

మ్యూజికల్ డైరెక్టర్ సాయి కార్తీక్ టీమ్ శృతి, గాయత్రి, ప్రవీణ్, పవన్ లు పాడిన పాటలు ప్రజలను బాగా అలరించాయి.. వారు బీమ్లా నాయక్ అంటూ పాడిన పాట ప‌ర్యాట‌కుల‌ను ఉర్రూతలు ఊహించింది.. ఆకాశంలో ఒకతార అంటూ పాడిన పాటకు ప్రేక్షకుల నుంచి అధికంగా స్పందన వచ్చింది… సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, జబర్దస్త్ టీమ్ హాస్య భరిత నాటికలు, ప్రేక్షకులకు ఆద్యాంతం వినోదాన్ని పంచాయి. సాయి కార్తీక్ బృందం యమహోని.. యమా అందం అంటూ.. చెలరేగింది.., వాలా వాలా టాక్సీ వాలా అంటూ తదితర సినీ గీతాలకు నర్తించటం యువతను బాగా ఆకట్టుకున్నాయి.

గాయకులు హొయ్యరే హొయ్య ముద్దల మామయ్య ..యా యా జై బాలయ్య వంటి సినీ గీతాలు అద్భుతంగా ఆలపించి ప్రేక్షకుల్లో జోష్ నింపారు. కుర్చీ మడతపెట్టు అంటూ.. నాటు నాటు వంటి పాటలతో కుర్రకారును ఉర్రూతలూగించారు. ఈ పేటకు మీరే మేస్త్రి పాట ఉర్రూతలూగించింది… బందరు లడ్డూ అంటూ … అరి హో సాంబ అంటూ…. పిల్లా నువ్వు లేని జీవితం అంటూ బాగా ఆకట్టుకున్నాయి..

ఈ కార్యక్రమానికి రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి. నారాయణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి లు ముఖ్య అతిథులుగా వచ్చారు..

జబర్దస్త్ హైపర్ ఆది టీమ్, పర్యాటకులను అలరించారు.. ఆయన వేసిన పంచులు చూస్తే.. మీరు తప్పట్లు కొడితే దోమలు పోతాయి అని అన‌డానికి దీనికి నిద‌ర్శ‌నం.. మీరు గట్టిగా అరిస్తే మా శేషు పోతాడు అని అనడంతో ప్రజలు చప్పట్లు కొట్టారు.. వయసు అయిపోతే మడత కాజా అంటారు..కాదు ముడత కాజా అంటారు అనడంతో ప్రజల నుంచి చప్పట్లు.. పిల్లల విషయంలో ఇంట్లో ఎవరి పెత్తనం అంటే పెత్తనం ఎవరిది ఐతే విత్తనం వారిదే అవుతుంది అని ఆది పంచలు వేచారు.. వినోద్, ఆదీలు ప్రదర్శించిన ఫ్యామిలీ స్కిట్ అదిరింది.. భార్య అంటే భర్తలో సగం అన్న స్కిట్ అదిరింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం లో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పై ప్రదర్శించిన వీడియో
ఆకట్టుకుంది.ఆపరేషన్ సింధూర్ పై ప్రదర్శించిన వీడియో ప్రజలను ఆకట్టుకుంది. మంత్రి నారా లోకేష్ పై ప్రదర్శించిన ఏవీ అభివృద్ధి కి సంకేతంగా ఉంది.

కార్యక్రమంలో తొలిగా గుడివాడకు చెందిన శివజ్యోతి నృత్యాలయ చిన్నారుల కూచిపూడి నాట్య బృంద ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఈ ప్రదర్శనలో చిన్నారులు తమ హావభావాలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.చుట్టూర్పు గ్రామానికి చెందిన నాంచరయ్య బృంద సభ్యుల డప్పు కళాకారుల నృత్య ప్రదర్శన కూడా ఆకట్టుకుందిగూడూరుకు చెందిన ఆంజనేయులు బృందం మహిళల మురళీ కోలాటం ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సౌమ్యా రావు, చంద్రిక యాంకరింగ్ అందరినీ అలరించాయి.

 

LEAVE A RESPONSE