Suryaa.co.in

Features

మే 1 ఒక మతోత్సవ దినం!

మే 1ని శ్రామికులు లేదా కార్మికుల దినంగా మనం చూస్తున్నాం. మార్క్సిస్ట్‌ల చిత్రీకరణ ఇది. నిజానికి మే 1 ఒక మతోత్సవ దినం! దీన్ని మార్క్సిజమ్ కబ్జా చేసేసింది.

2000యేళ్లకు పూర్వందైన పేగన్ మతావలంబకులు మే 1ని వసంతోత్సవ దినంగా యూరప్ దేశాల్లో పాటించేవారు. ఆ మే 1ని, 1889లో అంతర్జాతీయ సోషలిస్ట్ కాంగ్రెస్ అంతర్జాతీయ శ్రామికుల దినంగా పరిగణించడమూ, అనుసరించడమూ మొదలుపెట్టింది.

ఈ మే 1ని శ్రామికుల దినంగా ప్రపంచమంతా పరిగణించడం లేదు. అమెరికా, కేనడాలలో సెప్టెంబర్ నెలలోని మొదటి సోమవారాన్ని, బ్రిటన్‌లో మే నెలలోని మొదటి సోమవారాన్ని, న్యూజీలండ్‌లో అక్టోబర్ నెలలోని మూడవ సోమవారాన్ని శ్రామికుల దినంగా పాటిస్తున్నారు.

ఒక మతోత్సవ దినమైన మే 1ని తమకు కావలసినట్టు శ్రామికుల దినంగా చేసింది లేదా మార్చేసింది మార్క్సిజమ్. మార్క్సిజమ్ మేధావులు ఒక మతోత్సవ దినాన్ని ఇలా కబ్జా చేసేశారు లేదా కబళించేశారు అటుపైన దానికి తమ రంగు పులిమేశారు. ఇలా చెయ్యడం, ఇలాంటివి చెయ్యడమే మార్క్సిజమ్ నైజం; ప్రత్యేకత; ఘనత.

– రోచిష్మాన్
9444012279

LEAVE A RESPONSE