Suryaa.co.in

Features Sports

పతకమా?… పథకమా?

  • ఒక రోజులో రెండు కేజీల బరువు పెరుగుతారా?
  • వినేష్ పోగట్ బరువు పెరుగుతుంది అంటే కోచ్ , డైటీషియన్లు ఏం చేస్తున్నారు?

ఆడపిల్లలు దేశం కోసం ఆడకండి, మీ ఆరోగ్యాలను కాపాడుకోవడం కోసం మాత్రమే క్రీడల్లోకి రండి. ఎందుకంటే క్రీడా సంఘాలు రాజకీయ నాయకుల తొత్తులయ్యాయి. క్రీడల గురించి ఏమీ తెలియని కుసంస్కారులు ఆధిపత్యం చలాయిస్తూ మహిళా క్రీడాకారులను వేధించిన విషయాలపై ఎన్నో సినిమాలు వచ్చాయి. దానిని నిజం చేస్తూ నేడు రియల్ పిక్చర్ ఒలింపిక్స్ లో కనబడింది.

తనను బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించాడని వినేష్ పొగట్ న్యాయ పోరాటం చేసి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా, ధైర్యంగా నిలబడి ఒలింపిక్స్ ఫైనల్ వరకు వెళ్లడం భారతదేశానికి ఎంతో గర్వకారణం. కానీ దేశానికి పతకాలు రాకపోయినా పర్వాలేదు ఆమె మాత్రం అవమానాల పాలు కావాలన్నది బ్రిజ్ భూషణ్ సంఘీయుల పన్నాగం కాదా?”

కోచ్ ఇవ్వబడ్డాడు.
కోరిన సౌకర్యాలు కల్పించబడ్డాయి.
అంతేకాక 53 కేజీల విభాగంలో ఓడిపోతే కోరిన 50 కేజీల విభాగంలో అంతకు ముందు సెలెక్ట్ ఐన రెజ్లెరును తప్పించి అవకాశం ఇవ్వబడింది. సరే.వినేష్ పోగాట్ కు అన్నీ ఇవ్వబడ్డాయి అనుకుందాం.

మరి 53 కేజీల విభాగంలో పోగాట్ ను ఓడించిన రెజ్లర్ ఏ స్థాయిలో ఉన్నది?ఒలింపిక్స్ లో కనీసం కాంస్యం వరకైనా చేరిందా? మరి పోగాట్ ఏమి తక్కువ చేసింది?మన దేశాన్ని జీరోలో ఉంచ లేదే. క్వార్టరులో ప్రపంచ చాంపియన్ జపాన్ రెజ్లరుపై సెమీసులో క్యూబా రెజలెరుపై పైచేయి సాధించి ఫైనలకు వెళ్ళింది కదా. ఇంతవరకు ఒలింపిక్స్ లో మహిళారెజ్లర్ ఏ విభాగంలోనూ ఫైనల్ కెళ్ళిన చరిత్ర లేదు.

ఇప్పుడు ప్రప్రధమ మహిళగా పోగాట్ ఫైనల్ కెళ్ళి చరిత్ర సృష్టించింది.
ఫైనల్ పోరుకు ప్రమాణానికి మించి కొద్ది బరువు ఉండటం వలన అర్హత కోల్పోయింది.
50కేజీల లోపు బరువు కోసం విశేషంగా కృషి చేసింది.
100గ్రాముల బరువు తగ్గింపు కోసం తల కేశాలను పొట్టిగా కత్తిరించుకున్నది.
తలను బోడి చేసుకోవటానికి సైతం సిద్ద పడిందట.
ఇదంతా దేశం కోసం కాదా!

మరి ఫైనల్ ముందు కోచ్ డైటీషియెన్ డాక్టరు ఏ జాగ్రత్తలు తీసుకున్నట్లు? వారిపై ఏ చర్య ఎందుకు తీసుకోలేదు
మరి ఆడెవడో బీజేపీ లీడరు కౌశల్ అట. కుసంస్కారి. అవును వాడు కుసంస్కారే. బట్టలూడ తీసుకుంటే ఆ 100గ్రాముల బరువు తగ్గేది కదా అని పోగాట్ ను అసభ్యంగా హేళనగా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నాడు.

సంఘీయ మహిళలు ఆమెపై బరువు పట్ల తగు జాగ్రత్తలు తీసుకోలేదన్నట్లుగా వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. పోగాట్ పట్ల వీళ్ళ మాటలు విమర్శలు హేళనలు బట్టి చూస్తుంటే గతంలో పోగాట్ తనను లైంగికంగా వేధించిన బ్రిజ్ భూషణను శిక్షించాలని తనకు న్యాయం చేయాలని వీధి పోరాటం చేసి భూషణ్ ను, బీజేపీని, మహిళా లోకంలో దోషిగా నిలబెట్టిందన్న కక్షతో ఆదినుండి ఆఖరువరకు బ్రిజ్ భూషణ్ సంఘీయులు ఆమె ఫైనల్ కు అర్హత లేకుండా తెర వెనుక వుండి పన్నాగం పన్నారనిపిస్తున్నది.

అసలు ఏ వ్యక్తి అయినా ఒక రోజులో రెండు కేజీల బరువు పెరుగుతారా? వినేష్ పోగట్ బరువు పెరుగుతుంది అంటే కోచ్ లు డైటీషియన్లు ఏం చేస్తున్నారు? ఇటువంటి కుహనా రాజకీయ నాయకులు చేతిలో క్రీడా సంఘాలను పెడితే దేశానికి పథకాలు ఎలా వస్తాయి? చేయని తప్పుకు వినేష్ పోగట్ ను బలి పశువును చేసి సంకలు కొట్టుకుంటున్న రాబందుల విషయంలో ప్రధాని, రాష్ట్రపతి జోక్యం చేసుకొని క్రీడా సంఘాలను స్వతంత్ర సంఘాలుగా మారిస్తే అప్పుడు పతకాలు వస్తాయి.

LEAVE A RESPONSE