– వ్యధ గా మారనున్న తీయని కల
దేశంలో విదేశీ మోజులో ఇరవై శాతం విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. ఇమిగ్రేషన్ ఆఫిసుల చుట్టూ ప్రదక్షిణలు పడిగాపులు కాస్తున్నారు. ప్రతి రోజు ఇమిగ్రేషన్ ఆఫిసులో వేల కొలది విద్యార్థులు ఉంటున్నారు, అందులో కేవలం పదుల సంఖ్యలో కొందరికి భాగ్యం కలుగుతుంది.
దేశం యొక్క భద్రతలో ఇమ్మిగ్రేషన్ ప్రోటోకాల్‌లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందువల్ల, వీసా నియమాలను పాటించడంలో విఫలమైతే, దరఖాస్తు తిరస్కరించబడవచ్చు. వీసా తిరస్కరణ అత్యంత స్పష్టమైన కారణం కావాల్సిన దేశాన్ని సందర్శించడానికి అర్హతను నిరూపించడంలో విఫలమైన పత్రాలు లేదా సమాచారం. ఇది ఉత్సాహాన్ని పాడుచేయడమే కాకుండా భవిష్యత్ వీసా ఆమోద అవకాశాలను కూడా దెబ్బతీస్తుంది.
తప్పిపోయిన పత్రాలు లేదా సమాచారం కాకుండా, దీనికి అనేక ఇతర కారణాలు ఉన్నాయి. ప్రతి రోజు వేల కొద్దీ వీసా అప్లికేషన్లు తిరస్కరణకు గురవుతున్నాయి. వేర్వేరు కాన్సులేట్‌లు వేర్వేరు వీసా ప్రాసెసింగ్ సమయాలను కలిగి ఉంటాయి. కాబట్టి, థ్రెషోల్డ్ ప్రాసెసింగ్ సమయానికి ముందే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రయాణ షెడ్యూల్‌కు కనీసం ఒక నెల ముందు వీసా దరఖాస్తు చేసుకోండి. ప్రాసెసింగ్ సమయం ప్రయాణ తేదీని దాటితే, వీసా స్వయంచాలకంగా తిరస్కరించబడుతుంది.
ఏదైనా దేశాన్ని సందర్శించాలంటే, బ్యాంక్ ఖాతాలో తగినంత నిధులు ఉండాలి. కాన్సులేట్ నిర్దిష్ట దేశంలో బస చేసే ఖర్చుగా కొంత నిర్దిష్ట మొత్తాన్ని సెట్ చేసింది. ఖాతాలో ఆశించిన మొత్తాన్ని ప్రతిబింబించకపోతే, అది వీసా తిరస్కరణకు కారణం కావచ్చు.
ఉన్నత చదువుల కోసం అమెరికకా వెళ్లిన భారతీయ విద్యార్థులకు నిరాశ ఎదురయింది. ఎంతో ఆశతో యూఎస్ లో అడుగు పెట్టిన విద్యార్థులు తిరిగి ఇండియాకు చేరుకున్నారు. అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో చేరేందుకు భారత్ కు చెందిన 21 విద్యార్థులు గురువారం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా, షికాగో ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారు ఎయిర్ పోర్టులో దిగగానే ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను అడ్డుకున్నారు.
విద్యార్థులను పలు డాక్యుమెంట్లు చూపాలని కోరారు. ఆ తర్వాత వారిని ఎయిరిండియా విమానంలో తిరిగి భారత్ కు పంపారు. విద్యార్థులు ఇమిగ్రేషన్ అధికారులను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. విద్యార్థులు తిరిగి ఢిల్లీ చేరుకోనున్నారు. సాధారణంగా అమెరికా ఎయిర్ పోర్టుల్లో ఇమిగ్రేషన్ అధికారులు ఉంటారు. అనుమానం వచ్చిన ప్రయాణికులను వారు ప్రశ్నిస్తారు. అవసరమైతే పత్రాలు కూడా చూపించమంటారు.
ఇలా భారతీయ విద్యార్థుల వద్ద వారు వర్సిటీకి పే చేసిన బిల్లులు, విద్యార్థులు ఆర్థిక పరిస్థితి పత్రాలు చూశారు. ఎలాంటి కారణం లేకుండా 21 మంది విద్యార్థులను డిపోర్ట్ చేశారు. దీంతో ఈ 21 మంది విద్యార్థులు మరో ఐదుగురు వరకు అమెరికా వెళ్లడానికి సాధ్యం కాదు. ఎయిర్ పోర్టుకు చేరుకున్న విద్యార్థులను సుమార్ 16 గంటల పాటు ఇరుకు గదుల్లో కూర్చోబెట్టినట్లు విద్యార్థులు తెలిపారు. ఆ తర్వాత తక్షణమే ఇండియా తిరిగి వెళ్లిపోవాలని చెప్పారు.
తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని కొందరు ప్రశ్నించగా.. జైలుకు పంపిస్తామని బెదిరించినట్లు చెప్పారు. గతంలో కూడా చాలా మంది భారతీయ విద్యార్థులు వెనక్కి వచ్చారు. వారు అక్కడున్న యూనివర్సిటీల గురించి తెలియకుండా నకిలీ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నారు. తీరా అక్కడ వెళ్లగా అవి నకిలీ యూనివర్సిటీలని తేలడంతో వారు ఇండియాకు తిరిగి రావాల్సి వచ్చింది.
అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల ఆర్థిక స్థితిగతులు తెలుసుకుంటారు. విద్యార్థి బ్యాంక్ బ్యాలెన్స్ సరైన మొత్తంలో డబ్బు ఉందో లేదో చెక్ చేస్తారు. అయితే చాలా మంది విద్యార్థులు యూఎస్ వెళ్లాక పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారు. భారతీయ విద్యార్థులు స్థానికులకు పార్ట్ టైమ్ జాబ్ దొరకడం లేదని పార్ట్ టైమ్ ఉద్యోగాలపై ఆంక్షలు విధించారు.
విదేశీ విద్య, విదేశీ కొలువు ఓ మేడిపండు… వెట్టి చాకిరీకి సముద్రాలు దాటి…
ఆధునిక వెట్టి చాకిరి : ఎన్నో ఏళ్ళ క్రితం అంతరించి పోయిన వెట్టి చాకిరి వ్యవస్థ అక్కడ ఇప్పుడు సరికొత్త రూపంలో వేళ్ళూనుకొంటోంది . దూర ప్రాంతాల నుంచి, కొండంత ఆశతో వచ్చిన యువతీ యువకులు, అక్కడ సరికొత్త వెట్టి బానిసలుగా మారిపోతున్నారు . యువకులు గ్యాస్ స్టేషన్లు , హోటళ్లు , మాల్స్ మొదలైన చోట లో- స్కిల్ లేబర్ గా పని చేస్తున్నారు . అతి తక్కువ జీతం . పని గంటలు అధికం . ఇన్సూరెన్స్ ఉండదు . కార్మిక చట్టాలు వర్తించవు . కొన్ని సార్లు అవమానాలు . ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియదు.
యువతుల పరిస్థితి మరీ దారుణం . అక్కడ స్కిన్ ఇండస్ట్రీ , తార్పుడు గత్తెలు వారిని టార్గెట్ చేసి ఊబిలోకి లాగుతున్నారు . విధి లేని పరిస్థితుల్లో అనేక మంది అమ్మాయిలు డర్టీ వర్కర్లుగా , అలాంటి సైట్ల నటీమణులు గా మారిపోతున్నారు . బతకడానికి ఏదో చేయాలి అనే నిస్పృహలో ఉన్నారు.
ఆ దేశం పేరు తెలుగులో కె తో మొదలవుతుంది . అక్కడికి ఉన్నత విద్య కోసం వెళ్లిన కొందరు భారతీయ విద్యార్థుల పరిస్థితి ఇది . అక్కడి కాలేజీలో ఉన్నత విద్య కోసం వెళ్లిన ప్రతి నలుగురు విదేశీ విద్యార్థుల్లో ముగ్గురు మన దేశ విద్యార్థులే . అక్కడి ఉన్నత విద్యా సంస్థలు బతుకుతున్నది మన దేశ విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజుల వల్ల. ఇప్పుడు ఆ దేశంలో నెంబర్ వన్ ఇండస్ట్రీ విదేశీ విద్యార్థులకు విద్యనందించడం.
దేశంలోని తెలుగు రాష్ట్రాల విద్యార్థులే అక్కడ ఎక్కువ .ప్రతి కాలేజీ, ఏజెంట్లను నియమించుకొంది. వారికి ఒక్కో అడ్మిషన్ కు ఇంత చొప్పున కమిషన్ అందుతుంది . తమ కమిషన్ కోసం వీరు తిమ్మిని బమ్మిని చేస్తారు . నిజం చచ్చినా చెప్పారు . మాయ చేసి.. మోసం చేసి విద్యార్థులను తెస్తారు . చెప్పే చదువు అంతంత మాత్రం . ఫీజులు అధికం . దోపిడీ . అడిగే వాడుండడు . అడిగినా సమాధానం రాదు.
ఆ దేశంలో మొత్తం వ్యవస్థ ఈ విషయంలో కుమ్మక్కయ్యాయి . ప్రభుత్వం , రాజకీయ నాయకులు పట్టించుకోరు . పట్టించుకుంటే కాలేజీలకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలి . అసలే కరోనా కాలంలో దివాలా ఎత్తాయి. ఏమీ జరగనట్టు చూస్తుంటే కాలేజీలకు ఆదాయం . తమకూ లంచాలు . ఉభయ కుశలోపరి. అక్కడ చదువుతున్న ప్రతి పది మంది విద్యార్థుల్లో ఆరుగురు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు .
అనేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి . ప్రతి నెల కొన్ని డెడ్ బాడీస్ ఇండియాకు పార్సెల్ వస్తాయి. పత్రికల్లో ఇలాంటి వార్తలు రావు . కారణం ఇవన్నీ తల్లిదండ్రులకు నచ్చవు . వారికి తమ పరువు ముఖ్యం . విదేశీ విద్య పేరుతో నడుస్తున్న కన్సల్టెన్సీలకు నష్టం . వారికి తమ ఆదాయం ముఖ్యం.
దొంగ సర్టిఫికెట్ లేదా మరొకటి .. విమానం ఎక్కారా? అక్కడ దిగారా? అనేది చాలా మంది తల్లితండ్రులకు ముఖ్యం . నలుగురితో గొప్పలు చెప్పుకోవాలి . లేకపోతే తల తీసేసినట్టు ఫీల్ అవుతారు.
అక్కడ .. గ్యాస్ స్టేషన్ లో పని చేస్తున్నారా? లేక టాయిలెట్లు కడుగుతున్నారా ? అనేది అనవసరం . నోరు తిరగని యూనివర్సిటీ / కాలేజీ పేరు చెప్పి గొప్పలు పోవాలి . ఎంతో మంది గతంలో పోయారు . ఏదో విధంగా సెటిల్ అయిపోయారు . ఇప్పుడు మన వాడు ఇంతే అనుకుంటారు . నలుగురితో నారాయణ . ఇక్కడుంటే తమ గుండెలపై భారం.
ఇరుగు పొరుగు వారు ” ఫారిన్ కు పోలేదా ? క్యాంపస్ రిక్రూట్మెంట్ లో సెలెక్ట్ కాలేదా ? ప్యాకేజీ ఎంత?” అనే ప్రశ్నలతో పీక్కు తింటారు . ఇక్కడి వ్యవస్థలకు కూడా ఇదే కావాలి . ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు . నిరుద్యోగ యువత ఇక్కడుంటే అశాంతి, అలజడి . వెళ్ళిపోతే వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత తప్పుతుంది .