రూ.2 కోట్లతో పాలకుర్తిలో సేవాలాల్ భవనం

-ఎకరం స్థలంలో ఒక గుడి, ఫంక్షన్ హాల్ ఏర్పాటు
-ఈ నెల 26న ప్రత్యేక పూజలు, శంకుస్థాపన
-మహారాష్ట్ర నుండి సేవాలాల్ ఆరాధ్య పండితుల రాక
-నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా జన సమీకరణ
-మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి
-సంప్రదాయ బద్ధంగా ఘనంగా ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు
-మండలాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

సంత్ శ్రీ సేవాలాల్ 284వ జయంతి ని పురస్కరించుకొని ఈ నెల 26 న నియోజకవర్గ కేంద్రం పాలకుర్తి లో ఒక ఎకరా స్థలంలో రూ.2 కోట్లతో పాలకుర్తిలో సేవాలాల్ భవనం, ఎకరం స్థలంలో ఒక గుడి, ఫంక్షన్ హాల్ ఏర్పాటుకు, ఈ నెల 26న ప్రత్యేక పూజలు, శంకుస్థాపన చేయనున్న దృష్ట్యా మహారాష్ట్ర నుండి సేవాలాల్ ఆరాధ్య పండితుల రప్పిస్తున్నమని, నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా లంబాడీ గిరిజనులు తరలిరావాలని, సంప్రదాయ బద్ధంగా ఘనంగా ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ మేరకు మంత్రి మండలాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గం లోని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, పెద్ద వంగర మండలాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ,సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్య దైవము. హిందూ ధర్మం గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావుడు ,సమాజానికి నిజమైన సేవకుడు సంత్ సేవాలాల్.

సేవలాల్ 1739 ఫిబ్రవరి 15న అనంతపూర్ జిల్లా గుత్తి సమీపం గొల్లల దొడ్డి సేవాఘడ్ లో జన్మించారు.సెవలాల్ అసలు పేరు సేవా భీమ్ నాయక్ రాథోడ్జీవితమంతా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర్య సమర యోధుడు. 22 రకాల సంస్కరణలు, జీవన సూత్రాలను బంజరాలకు వివరించారు. అడవులను సంరక్షిస్తూ, పర్యావరణాన్ని కాపాడాలని బోధించారు.ఏ రూపంలోనూ వివక్ష తగదన్నారు.మహిళలను గౌరవించాలని, వారు కనిపించే దేవుళ్ళని, సత్యమే పలకాలని, ఎవరికీ హాని చేయవద్దని చెప్పారు. మానవత్వాన్ని కలిగి ఉండాలని చెప్పారు. ఆయనను శివ రాథోడ్ గా పేర్కొన్నారు.
బ్రిటిష్ వారు సైతం సేవా లాల్ ప్రవచనాలను గుర్తించి, గౌరవించారు. పుస్తకాల రూపంలో నిక్షిప్తం చేశారు.సంత్ సేవాలాల్ అహింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తు ఇతర కులాలకు ఆదర్శపురుషుడయ్యారు.బంజారా జాతిని మంచి మార్గంలో నడిపించేంందుకు సేవాలాల్‌ మహారాజ్‌గా మారారు.సేవాలాల్‌ మహరాజ్‌ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు.

ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడిలు అరికట్టడం, క్షేత్రధర్మాన్ని రక్షించడం లాంటి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు.మూఢ నమ్మకాలను నమ్మొద్దు అని ప్రజలకు చెప్పిన సంఘ సంస్కర్త.సేవాలాల్ మహారాజ్ ఆనాడే బంజారా జాతి పరువు ప్రతిష్టల గురించి ముందుగానే ఊహించి అహింస సిద్దాంతాన్ని ఆచరించి చూపారు.

సీఎం కేసిఆర్ కి సంత్ సేవాలాల్ బోధనలు తెలుసు కాబట్టే సంత్ సేవాలాల్ జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నారు.సేవా లాల్ జయంతి ఉత్సవాలకు కోటి రూపాయలు కేటాయించారు. కేసీఆర్ బంజారాల కోసం 3 వేల 146 తండాలను గ్రామ పంచాయతీ లుగా మార్చి, వారి ఆత్మ గౌరవం పెంచారు.
బంజారాల జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేశారు.సారా మాన్పించి, పునరావాసం కల్పించారు.బంజారాల ఒకప్పుడు రాజుల సైన్యానికి సేవలు చేసిన ఘనత ఉన్న వారు.రాజస్థాన్ లో బంజారాల రాజ పుత్రులుగా గౌరవం ఉంది.అలాగే సంప్రదాయ బద్దంగా ఆయన బోధనలను విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.

ప్రతి తండా నుండి లంబాడీలు తరలి రావాలి. ప్రతి మండలానికి కనీసం 3 వేల మంది భార్యా భర్తలు జంటలుగా కలిసి రావాలి.బంజారాల సేవా లాల్ సేవలు గుర్తు పెట్టుకొని, సీఎం కెసిఆర్ చేస్తున్న మంచి పనులలో భాగస్వాములు అవుతూ, కెసిఆర్ గారికి అండగా నిలవాలని కోరుతున్నాను.ఈ కార్యక్రమాల్లో ఆయా మండలాల స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, నేతలు, లంబాడీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply