– భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
– అర్చకులు, ఫాదర్లు, ఇమామ్ ల సర్వమత ప్రార్థనలు
గుడివాడ, అక్టోబర్ 22: మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి ఆధ్వర్యంలో శుక్రవారం గుడివాడ పట్టణం గంగానమ్మ వీధిలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడపా బాబ్జి జ్యూయలరీ షాపు ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. ముందుగా సర్వమత ప్రార్థనలు నిర్వహించి మంత్రి కొడాలి నానిని అర్చకులు, ఫాదర్లు, ఇమామ్లు ఆశీర్వదించారు. పెద్దఎత్తున అభిమానులు మంత్రి కొడాలి నానిని భారీ గజమాలలతో సత్కరించారు. వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పుట్టినరోజు వేడుకలకు తరలిరావడంతో గంగానమ్మ వీధి కిక్కిరిసిపోయింది. మంత్రి కొడాలి నానిపై అడుగడుగునా పూలవర్షం కురిపించారు. కేక్ను కట్ చేసిన అనంతరం మంత్రి కొడాలి నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పెద్దఎత్తున యువత మంత్రి కొడాలి నానితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తిని కనబర్చారు. మంత్రి కొడాలి నాని కూడా స్వయంగా సెల్ఫీలు తీస్తూ అభిమానులను ఉత్సాహపర్చారు. ప్రతి ఏటా మాదిరిగా మంత్రి కొడాలి నాని పుట్టినరోజు సందర్భంగా కొద్దిరోజుల నుండి గుడివాడ పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. పట్టణంలో ఎక్కడా చూసినా మంత్రి కొడాలి నాని ఫ్లెక్సీలే కన్పించాయి. ఈసారి యువకులు పెద్దఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి మంత్రి కొడాలి నానిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ ఆర్టీవో జీ శ్రీనుకుమార్, మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్, ఆర్టీవో సీతాపతిరావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఆలయ కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్, డ్వామా పీడీ గోర్జి సూర్యనారాయణ, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిణి ఎం సముద్రవేణి, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ పడమట సుజాత, పార్టీ సీనియర్ నాయకులు పాలడుగు రాంప్రసాద్, వల్లూరుపల్లి సుధాకర్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్విక్టర్, నందివాడ మండల అధ్యక్షుడు పెయ్యల ఆదాం, కొండాలమ్మ దేవస్థానం చైర్మన్ కనుమూరి రామిరెడ్డి, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ డైరెక్టర్ ఎన్ మోహన్రెడ్డి, పార్టీ నాయకులు డివిఎస్ శ్యామ్ కుమార్, అద్దేపల్లి పురుషోత్తం, అద్దేపల్లి హరిహరప్రసాద్, సయ్యద్ గఫార్, కొంకితల ఆంజనేయ ప్రసాద్, లోయ రాజేష్ , గుళ్ళపల్లి శ్రీను, మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి, ఫర్నీచర్ పార్క్ బెనర్జి, గిరి బాబాయ్, చింతల భాస్కరరావు, డొక్కు రాంబాబు, జోగా సూర్యప్రకాశరావు, అడబాల అప్పారావు, సింహాద్రి శివరాంబాబు, బొగ్గరపు తిరుపతయ్య, అల్లూరి ఆంజనేయులు, ముద్దినేని దుర్గానాయుడు, గోవాడ చంటి, మాదాసు వెంకటలక్ష్మి, అల్లం రామ్మోహన్, అల్లం సూర్యప్రభ, షేక్ బాజీ, రహ్మతుల్లా షరీఫ్, షేక్ మౌలాలి, తప్పిట నీలిమ, ఈడే వెంకటేశ్వరమ్మ, ఈడే వెంకటేశ్వరరావు, యేల్చూరి వేణు, తాళ్ళూరి ప్రశాంత్, సునీత, రమీజ, హారిక తదితరులు పాల్గొన్నారు.