Suryaa.co.in

Telangana

చదువుల తల్లికి అండగా నిలిచిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

– ఐదేండ్లు చదువుల బాధ్యత
– పుస్తకాలు, బట్టలకు అప్పటికప్పుడే ఆర్ధిక సహాయం

హైద‌రాబాద్ : ఎంబీబీఎస్ సీటొచ్చినా.. కూలీ పనులకు వెళ్తున్న మెదక్ జిల్లా, కౌడిపల్లి మండలం, సలాబత్ పూర్ గ్రామానికి చెందిన కాట్రోజు సుమలత ఆర్ధిక ఇబ్బందుల గురించి తెలుసుకొని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చలించిపోయారు

ప్రతిభావంతురాలైన సుమలత చదువులకు ఆర్ధిక ఇబ్బందులు అడ్డుగా మారకూడదన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తాను సుమలతకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.. ఇవ్వడమే కాదు, సుమలత, తండ్రి శివరాంకు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ సంవత్సరం చదువులకు కావల్సిన ఆర్ధిక సహాయం అందించారు. పుస్తకాలు, బట్టలు ఇతర ఖర్చులకూ ఆర్ధిక సహాయం చేశారు. మంచిగా చదువుకొని డాక్టర్ గా పేద ప్రజలకు సేవ చేయాలని ఆశీర్వదించారు.. ఏ ఇబ్బంది ఉన్నా నేనున్నాని భరోసా కల్పించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందనతో సుమలత, తండ్రి శివరాం భావోద్వేగానికి గురయ్యారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సర్ ఎంతో అప్యాయంగా మాట్లాడారు. మేమేవరమో తెలియకపోయినా సర్ మా కష్టం తెలుసుకొని.. మమ్మల్ని ఇంటికి పలిచి స్వీట్లు అందించి మర్యాద చేసి.. నా చదువులకు అండగా ఉంటానని చెప్పారు. కాలేజీ యాజమాన్యంతో మాట్లాడారు.

పుస్తకాలు, బట్టలకు అప్పటికప్పుడే ఆర్ధిక సహాయం చేశారు.. చేయడమే కాదు.. ఐదేండ్లు నా చదువుల బాధ్యత తీసుకుంటానని కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి సర్ చెప్పడం మాకు చాలా సంతోషం కలిగించింది. నాలాంటి ఎందరో పేద విద్యార్ధుల చదువులకు అండగా నిలబడుతున్న కోమటిరెడ్డి సర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నట్లు తెలిపారు.

LEAVE A RESPONSE