Suryaa.co.in

Andhra Pradesh

నాయకత్వానికి మానవత్వం అద్దిన మార్గదర్శి మంత్రి లోకేష్

– విఠంరాజుపల్లి బధిరుల పాఠశాలలో మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకలు
– విద్యార్థులకు పుస్తకాల పంపిణీతో పాటు అన్నదానం చేసిన చీఫ్ విప్ జీవీ

వినుకొండ: రాజకీయ నాయకత్వానికి మానవతా దృక్పథాన్ని అద్ది అందరి మన్ననలు అందుకుంటున్న అరుదైన నాయకుడు మంత్రి లోకేష్ అని కితాబిచ్చారు ప్రభుత్వచీఫ్‌విప్‌, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. విద్యారంగం, యువతపై ఆయనకు ఉన్న ప్రత్యేక అభిమానం, పట్టింపు రేపటి ఆంధ్రప్రదేశ్‌ మరింత ఉజ్వలంగా ఉండేందుకు బాటలు వేయనుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

వినుకొండ మండలం విఠంరాజుపల్లి సమీపంలోని సెయింట్ ఆన్స్ ఉషోదయ మానసిక వికలాంగుల పాఠశాలలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు చీఫ్ విప్ జీవీ స్వయంగా భోజనాలు వడ్డించారు.

అనంతరం మాట్లాడిన ఆయన నాయకుడిగా ఎంత ఎదిగినా అవసరంలో ఉన్నవారి విషయంలో మానవత్వ ంతో స్పందించి సాయం చేయడంలో ఉన్న తృప్తిని లోకేష్‌ను చూసే నేర్చుకుంటున్నామని అన్నారు. ఇటు ప్రజలకు, అటు కార్యకర్తలకు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తమలో కొత్తస్ఫూర్తిని నింపుతూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE