Suryaa.co.in

Andhra Pradesh

పరిశ్రమలు తీసుకురావాలన్నదే చంద్రబాబు లక్ష్యం

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

మంగళగిరి: రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందే రీతిలో పరిశ్రమలు తీసుకురావాలి, వేలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరగాలన్నదే చంద్రబాబు దావోస్ పర్యటన లక్ష్యమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ.. విజన్ 2047 అమలు చేయాలని, రాబోయే రోజుల్లో ఆంధ్రపదేశ్ ని అగ్రస్థానంలో నిలపాలన్నదే చంద్రబాబు తపన. మాజీ సీఎం జగన్ దావోస్ కు పెట్టుబడులకు వెళ్లి చలిగా ఉందని రూం లో ‘‘పాస్తా’’ తినుకుంటూ కూర్చోవడం సిగ్గుచేటు. చంద్రబాబు చలిగా ఉందని పాస్తా తింటూ కూర్చోక.. అంత చలిలో కూడా ప్రతి టెంటుకు వెళ్లి పెట్టుబడిదారులతో పెట్టుబడులను ఆహ్వానించారు, వారికి పెట్టుబడిదారులు సాదరంగా స్వాగతం పలికారు.

చంద్రబాబు 2014-19 మధ్యలో ‘‘సన్ రైజ్ ఏపీ’’గా రాష్ట్రాన్ని ప్రకటించి దేశానికి పరిచయం చేస్తే.. జగన్ ఏపీ బ్రాండ్ ని కుప్పకూల్చారు-‘‘డార్క్ ఏపీ’’గా మార్చారు. జగన్ ది ఆనాటి దావోస్ యాత్ర విహార యాత్ర అయితే.. చంద్రబాబుది నేటి దావోస్ యాత్ర ప్రజా జైత్రయాత్ర. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు లోకేష్ ను వెతుక్కుంటూ రావడం, చంద్రబాబు అపాయింట్ మెంట్ కొరకు తిరగడం పారిశ్రామికవేత్తలకు వీరిద్దరిపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. జగన్ పెట్టుబడులకోసం దావోస్ వెళ్ళినప్పుడు జగన్ ఏపీ ముఖ్యమంత్రి అని ఎవరి నోటా రాలేదు, చంద్రబాబు దావోస్ వెళ్తే వేనోళ్ల పొగడుతున్నారు.

జగన్ హయాంలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదలి పారిపోవడం జగన్ పై ఉన్న అపనమ్మకాన్ని తెలియజేస్తోంది. బిల్ గేట్స్ లాంటి దిగ్గజం చంద్రబాబును సాదరంగా ఆహ్వానించడం, ఆత్మీయంగా కౌగిలించుకోవడం, ఎంతైనా పెట్టుబడి పెడతానని హామీ ఇవ్వడం చంద్రబాబు విజన్ 2047 విజయాన్ని సూచిస్తోంది. దీంతో చంద్రబాబు ఖ్యాతిని ఇనుమడింపజేస్తోంది. చంద్రబాబు, లోకేష్ తండ్రి, కొడుకులు అనవసరంగా దావోస్ వెళ్లారని జగన్ మాట్లాడటం తప్పు.. చంద్రబాబు, లోకేష్ లు రాష్ట్ర సంక్షేమం కోసమే దావోస్ వెళ్లారు, జగన్ లా విహార యాత్రకు, లండన్ పర్యటనకు కాదు.

జగన్ పరిపాలన అవినీతిమయం, అస్తవ్యస్తం.. వైసీపీ నాయకులు ఇక రాష్ట్రంపై ఆశలు వదలుకోవాల్సిందే. అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు అన్న చందంగా జగన్ రాష్ట్రానికి మేలు చేయకపోగా.. చంద్రబాబు పర్యటనను ప్రశ్నించడం తప్పు, జగన్ కేబినెట్ లోని కోడిగడ్ల మంత్రి అమర్నాథ్ జగన్ దావోస్ లో చలిగా ఉందని బయటకు రాలేదని చెబితే.. చంద్రబాబు దావోస్ లో 6 డిగ్రీల చలిలో కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం తపించి, ప్రతి పెట్టుబడిదారుడిని కలిశారు.

చంద్రబాబును జగన్ విమర్శించడం సూర్యునిపై ఉమ్మేయటమే అవుతుంది. రాబోవు రెండు రోజుల్లో మొత్తం సినిమా ఇవ్వబోతున్నాం… వేలాదిమంది బిడ్డలకు ఉద్యోగాలు రాబోతున్నాయి. జగన్ పెట్టుబడులకై దావోస్ వెళ్లి ‘‘పాస్తా’’ తింటూ కూర్చోవడంతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని ఎంతవరకు ఆసక్తి ఉందో తెలుస్తోంది. రాష్ట్ర ప్రజలు.. వైసీపీ నాయకులను రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడనివ్వరని గ్రహించాలి. అంత చలిలో కూడా తండ్రి, కొడుకులు రాష్ట్రం కోసం తపిస్తుంటే, ఇబ్బందులు పడుతుంటే జగన్ కు మాట్లాడే నైతిక హక్కు లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నొక్కి వక్కాణించారు.

LEAVE A RESPONSE