నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లు, డ్రైనేజీ కాలవలు ఏర్పాటు చేసి గ్రామాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం సంబేపల్లి మండలం, దేవపట్ల గ్రామంలో సిమెంటు రోడ్డు నిర్మాణానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…పల్లెల్లో అభివృద్ధిని కాంక్షిస్తూ ఈనెల 14 నుండి 20వ తేదీ వరకు ఏడు రోజులపాటు పల్లెపండుగ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.
పల్లెపండుగ వారోత్సవాల్లో భాగంగా గ్రామాల్లో త్రాగునీరు, విద్యుత్తు, రహదారులు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పల్లెపండుగ వారోత్సవాలను నిర్వహిస్తోందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 4500 కోట్లతో 30 వేల పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. దీంతో ప్రతి గ్రామంలో నూతన శోభ సంతరించుకోనుందన్నారు. ఇప్పుడు శంకుస్థాపనలు చేసిన పనులన్నింటినీ సంక్రాంతి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.
ప్రభుత్వం పల్లెలకు పూర్వవైభవం తెచ్చేందుకే పల్లె పండుగ పేరుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రాబోయే రోజులలో ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొబ్బరికాయ కొట్టి సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.